మీ బాధలు పోవాలంటే కార్తీకంలో ఇలా చేయండి !

కార్తీకమాసం అంటే పవత్రమైన మాసం. ఈ నెలరోజులు చేసే పూజ, ధ్యానం, అభిషేకం దానం ఇలా ఏదైనా పవిత్రమైనదాన్ని ఆచరిస్తే అధిక ఫలం వస్తుందని శాస్త్ర వచనం. చాలామంది అనేక సమస్యలతో బాధ పడుతుంటారు. వాటిలో కొన్నింటికి పరిహారాలను ఈ మాసంలో ఆచరించాల్సినవి తెలుసుకుందాం..


ఎవరైనా కొత్త ఇల్లు కొనాలి అనుకునే వారు మణిద్వీప వర్ణన, భూమి అమ్మాలి అనుకునే వాళ్ళు గణేశ ప్రార్థన ఈ నెల మొత్తం పారాయణం చేస్తే శ్రీఘ్రంగా మీ కోరిక నెరవేరుతుంది. భూమి కొనాలి అనుకునే వాళ్ళు లక్ష్మీ వరాహ స్వామి ప్రార్థన శ్లోకం, ఉద్యోగం ,ప్రమోషన్ కోరుకునే వాళ్ళు కనకధార స్త్రోత్రం, రాజకీయ నాయకులు, పోలీసు శాఖ వాళ్ళు, క్రీడా రంగం వాళ్ళు, వారాహి కవచం,
నాటక రంగంలో ఉన్నవాళ్లు వైద్య వృత్తిలో వారు ప్రత్యంగిరి, నరసింహ స్త్రోత్రలు ఈ మాసంలో నియంగా నెల మొత్తం పారాయణం చేస్తుండాలి. ఇక చదువుకునే విద్యార్థుల సర్వస్వతీ , హాయగ్రీవ, వినాయక స్త్రోత్రలు చదవాలి
అన్ని విధాలా భయాలను తొలగించి కార్యసిద్ధి కలిగించడానికి హనుమాన్ చాలీసా చదువుకోండి. ఆధ్యాత్మిక జ్ఞానం, దైవనుగ్రహం కోసం ఈ మాసం మొత్తం దామోదర అష్టకం ప్రతి రోజూ చదవాలి. ఇలా పైన చెప్పిన మీ కోరికలను నెరవేరడానికి ఆయా స్తోత్రాలను పారాయణాలను పఠించి మీ ఇష్టకామ్యార్థాలను నెరవేర్చుకోండి.