నిజంగానే తధాస్తు దేవతలు ఉంటారా… తధాస్తు అంటే నిజంగానే జరుగుతుందా?

సాధారణంగా మనం సంధ్యా సమయంలో ఏదైనా అనరాని మాటలు కనుక అంటే ఇంట్లో పెద్దవాళ్లు తథాస్తు దేవతలు ఉంటారు అలా మాట్లాడకూడదు…సదాసు అంటే అదే జరుగుతుంది అని చెబుతుంటారు అసలు నిజంగానే ఈ తధాస్తు దేవతలు ఉంటారా తధాస్తు దేవతలు అంటే ఎవరు?వాళ్లు తధాస్తు అంటే నిజంగానే జరుగుతుందా అనే సందేహాలు తరచూ వస్తూ ఉంటాయి మరి నిజంగానే తధాస్తు దేవతలు ఉన్నారా ఈ విషయం గురించి పండితులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే….

పురాణాల ప్రకారం సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని యొక్క అఖండ తేజస్సుని భరించలేక, ఆమె ఒక గుర్రం రూపం ధరించి గురు దేశం వెళ్తుంది. అప్పుడు గురు దేశంలో గుర్రం రూపంలో ఉన్న సంధ్య దేవిని సూర్యుడు చూసి తను కూడా గుర్రం రూపం ధరించి సంధ్య దేవి దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో వారి కలయిక ద్వారా పుట్టిన వారే అశ్విని కుమారులు. వీరిని అశ్విని దేవతలు,తధాస్తు దేవతలు అని అంటారు. ఈ తధాస్తు దేవతలు వారి యొక్క బంగారు గతంలో సంచరిస్తూ ఉంటారు. వారు ప్రయాణించే మార్గంలో తధాస్తు అనే నామాన్ని చెబుతూ అదే విధంగా వేద మంత్రాలను ఆహ్వానిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. వీరు యజ్ఞాలు జరిగే ప్రదేశంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు.

ఈ తధాస్తు దేవతలు మంత్రాన్ని జపించే ఉపాసకుల మంత్రాల నుంచి సత్యాన్ని గ్రహించి వారిని అనుగ్రహిస్తారు. ఇక యజ్ఞం చేసే ప్రదేశానికి వచ్చి అక్కడ ఉన్న అధిపతులను, యజ్ఞ ద్రవ్యాలను మంచు బెత్తంతో తాకి వారిని అనుగ్రహిస్తారు. దేవతలు పయనిస్తూ ఉన్న సమయంలో మనం ఏదైనా చెడు మాటలు మాట్లాడిన తధాస్తుదేవతలు తధాస్తు అంటే తప్పకుండా జరుగుతుందని అందుకే ఎప్పుడూ కూడా మంచి మాటలనే పలకాలి అంటూ పండితులు చెబుతున్నారు.