Amar Deep: నీకంటే తనే ఎక్కువ….భార్యకు బిగ్ షాక్ ఇచ్చిన అమర్ దీప్.. షాక్ లో తేజు!

Amar Deep: అమర్ దీప్  పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అమర్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో అమర్ రన్నర్ గా నిలిచారు. ఈ కార్యక్రమం తర్వాత అమర్ బుల్లితెర కార్యక్రమాలకు కమిట్ అవ్వలేదు.

ప్రస్తుతం ఈయన వెండితెర సినిమా అవకాశాలను అందుకుంటూ పలు సినిమాలలో నటిస్తున్నారు. అదేవిధంగా పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక అమర్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన బుల్లితెర నటి తేజస్విని గౌడను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా అమర్ తన భార్య తేజస్వినికి ఊహించని షాక్ ఇచ్చారు.

శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో అమర్ దీప్ కంటెస్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న స్టార్ వారియర్స్ కార్యక్రమానికి సుహాసిని, తేజస్విని, మానస్ కూడా వచ్చారు. ఇక అమర్ వారికి సపోర్ట్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా అమర్ ఈ కార్యక్రమానికి రావడంతో శ్రీముఖి అమర్ కు ఒక ప్రశ్న వేస్తుంది.

Suhasini & Tejaswini 😂🤣👏 #bbjobi #biggboss #youtube #shorts

అక్కడ మీ అక్క భార్య నీ స్నేహితుడు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురిలో నీ ఫస్ట్ సపోర్ట్ ఎవరికి అంటూ శ్రీముఖి ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు అమర్ ఏ మాత్రం తడబడకుండా నేను నా ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్ తర్వాతనే నాకు ఎవరైనా అంటూ మాట్లాడటంతో ఒక్కసారిగా తేజస్విని షాక్ అయ్యారు. ఇక అమర్ సాధారణంగా స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తారని, ఆయనకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఫ్రెండ్స్ ముఖ్యమైనప్పటికీ భార్య వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యత భార్యకే ఇవ్వాలి కదా అంటూ అమర్ వ్యాఖ్యలపై నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.