Dil Raju: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే దిల్ రాజు మొదటి భార్య అనిత ఉన్న ఫలంగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఇలా ఈమె మరణించడంతో దిల్ రాజు తిరిగి తేజస్విని అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు.
తాజాగా తేజస్విని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజుతో పెళ్లి గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు. నిజానికి మా కుటుంబం సినిమాలకు చాలా దూరం మేము ఏడాదికి ఒక్కసారి అది కూడా దసరా పండుగ సమయంలో మాత్రమే థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తాం అలాంటిది దిల్ రాజు గారు సంబంధం రావడంతో అసలు ఆయన ఎవరు ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేశానని తెలిపారు. దిల్ రాజు గారితో పెళ్లి అంటే మా ఇంట్లో వాళ్ళును ఒప్పించడం కోసం ఎంతో కష్టపడ్డారు.
నిజానికి నేను మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగాను మా ఇంట్లో మా పెద్ద మామయ్య చాలా స్ట్రిక్ట్ ఆయనే హిట్లర్ ఏ విషయమైనా ఆయన అంగీకరిస్తేనే జరుగుతుంది ఆయనను ఒప్పించాలంటే కూడా చాలా కష్టం.పెళ్లికి ఎవరిని ఒప్పించాలి? అని దిల్ రాజు అడిగినప్పుడు మా పెద్దమామయ్య పేరు చెప్పాను. ఆయన మా కుటుంబంలో హిట్లర్‌లాగా ఉంటాడు.
అయితే ఈ పెళ్లి విషయం గురించి చెప్పడంతో ఆయన చాలా ఈజీగా ఒప్పుకున్నారని తేజస్విని తెలిపారు.కానీ, పిన్ని అసలు నమ్మలేకపోయింది. మా పెళ్లికి తను ఒప్పుకోలేదు. తర్వాత ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకొచ్చింది. మాతృత్వం గురించి మాట్లాడుతూ.. నా కొడుకు అన్వయ్ మూడేళ్లబాబులా ప్రవర్తించడు. ఎప్పుడైనా నేను బాధలో ఉంటే నాకు ముద్దుపెట్టి, అమ్మా బానే ఉన్నావా? అని అడుగుతాడు. అన్వయ్ పుట్టిన తర్వాత నా జీవితమే మారిపోయింది. బాబుకు ప్రస్తుతం మూడేళ్లు కావడంతో సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి చాలామంది అడుగుతున్నారు కానీ నాకు మరెవరు వద్దని బాబు ఒక్కడే చాలు అంటూ ఈమె సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు..