వివాహేతర సంబంధం పెట్టుకొని పొలంలోనే నరికేశాడు

ఆమె ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకొని ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అన్యోన్యంగా ఉన్నట్టు నటించాడు. ఆమెకు పైసలు అవసరం రావడంతో అప్పుగా ఇచ్చాడు. ఆమెను గత కొంత కాలంగా అప్పుగా ఇచ్చిన పైసలు ఇచ్చి వేయాలంటూ శారీరక వేధింపులకు పాల్పడ్డాడు. తన దగ్గర ఇప్పుడు లేవని తర్వాత ఇస్తానని చెప్పిన వినలేదు. వేధింపులు ఎక్కువ కావడంతో ఇక మన మధ్య ఎటువంటి సంబంధం వద్దని , నెల రోజుల సమయం ఇస్తే అప్పు తీరుస్తానని ఆమె చెప్పింది. అంతే కోపంలో కత్తితో ఆమె గొంతు కోసి చంపాడు. పూర్తి వివరాలు ఏంటంటే…  

వికారాబాద్ మండలం మదన్ పల్లి గ్రామానికి చెందిన మంజుల, చంద్రయ్య భార్య భర్తలు. చంద్రయ్య 3 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో మంజుల ఒంటరిగానే నివసిస్తోంది. మంజులకు ఆర్ధిక పరిస్థితి నిమిత్తం పైసలు అవసరం ఉండటంతో గ్రామానికి చెందిన మంగళి రాజశేఖర్ ను అప్పుగా పైసలు అడిగింది. మంజులకు అప్పుగా పైసలు ఇచ్చిన రాజశేఖర్ ఆమె పై కన్నేసి లొంగదీసుకున్నాడు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. మంజుల తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇచ్చేసింది.

కొద్ది నెలల క్రితం మంజులకు డబ్బలు అవసరం ఉండటంతో రాజశేఖర్ వద్ద రూ.80 వేలు తీసుకుంది.  ఆ పైసలు ఇవ్వాలని రాజశేఖర్ ఆమెను గత కొంత కాలంగా వేధిస్తున్నాడు. ఆమెను శారీరకంగా, మానసికంగా అనేక వేధింపులకు గురిచేశాడు.

దీంతో ఎదురు తిరిగిన మంజుల నీవు తనతో సంబంధం కొనసాగిస్తున్నావు… నేను ఇవ్వను అని చెప్పింది. అయితే మంజుల పైసలు ఇవ్వనని చెప్పడం, ఇక సంబంధం కొనసాగించనని కూడా చెప్పడంతో మంజుల  పై రాజశేఖర్ కసి పెంచుకున్నాడు.ఆమెను అంతమొందించాలని ప్లాన్ వేశాడు.

మంజుల దగ్గరకు వెళ్లిన రాజశేఖర్.. ఏదో తాగిన మత్తులో అలా అన్నానని.. డబ్బులు నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు కానీ మన ఇద్దరి మధ్య బంధాన్ని కాదనొద్దు అని బతిలాడాడు. దీనికి మంజుల కూడా సరే అంది. ఇక గొడవలొద్దని చెప్పి మనం ఎప్పుడు వెళ్లే బావి వద్దకు రా… తాను కల్లు తీసుకొని అక్కడికి వస్తానని చెప్పాడు. అలాగే మంజుల బావి దగ్గరకు ఒంటరిగా వెళ్లింది.

రాజశేఖర్ కూడా కల్లు తీసుకొని వెళ్లాడు. ఆమెతో ఎప్పుడు ఉన్నట్టుగానే ఉన్నాడు. కల్లు తాగి అన్యోన్యంగా ఉన్నాడు. తన కోరిక తీరగానే మంజులతో పైసల విషయం లేవనెత్తాడు.  ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన రాజశేఖర్ గుడిసెలో ఉన్న కత్తి తీసుకొని మంజుల తల, చేతులపై గాయపరిచాడు. తీవ్ర రక్త స్రావంతో మంజుల అక్కడికక్కడే కన్ను మూసింది.

మంజుల మరణించిందని కన్ఫామ్ చేసుకొని రాజశేఖర్ అక్కడి నుంచి పారిపోయాడు. సెల్ ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా మంజుల, రాజశేఖర్ ల సంబంధం గురించి గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. రాజశేఖర్ ఆచూకీ కోసం ప్రయత్నించగా పరారీలో ఉన్నాడు. శుక్రవారం ఈ సంఘటన జరగగా మంగళవారం రోజు రాజశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు వెల్లడించారు.