మీరేమీ ప్రధాన మంత్రండీ…

ఈ రోజులోక్ సభ లో ప్రధాని మోదీ ఒక మొదటి దఫా ఎంపి  నుంచి  పదనైన ప్రశ్న ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిని నుంచి అలాంటి ప్రశ్న ఎదురవుతుందని ప్రధాని మోదీ వూహించి ఉండరు.

ఈ రోజు లోక్ సభలో తెలుగుదేశం ప్రవేశపెట్టిన ఆవిశ్వా స తీర్మానం మీద చర్చను ప్రారంభిస్తూ గుంటూరు లో క్ సభ సభ్యుడు మోదీ మీద దాడి ప్రారంభించారు. ఇదే సభలో గత ప్రధాని చేసిన  హామీలను అమలు చేయాలన్న విషయం తెలియకపోవడం ఒక ప్రధాని గా మీకు తగునా అని ప్రశ్నించారు.గత ప్రధానిని మీరు గౌరవించరా అని అప్రశ్నించారు.  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెబితే  10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని అమలు చేయడం ఇప్పటి ప్రధాని బాధ్యత కాదా అన్నారు. మిస్టర్ ప్రైం మినిస్టర్ అంటూ ఇంగ్లీష్ లో కూడా సంబోధించడం బిజెపి వాళ్లకు గుచ్చుకుని ఉంటుంది. ఎందుకంటే, ప్రధానిని ప్రధానమంత్రి జీ అని హిందీలో సంబోధించాలనుకుంటూ ఉంటారు బిజెపి వోళ్లు.

మోదీ చేసి శుష్క వాగ్దానాలను గురించి జయదేవ్ ప్రస్తావించారు.  ప్రత్యేక హోదా విషయంలో  గత ప్రధాని చేసిన హామీ గుర్తుచేసి, దాని అమలు చేయడం  ఇప్పటి ప్రధాని బాధ్యత అని కూడా గుర్తు  చేశారు.  2014 ఎన్నికల  ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ లో వూరూర మోదీ చెేసిన వాగ్ధానం గురించి కూడా జయదేవ్ ప్రస్తావించారు.  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హాదొో ఇస్తానని, గంటూరు, నెల్లూరు లతో పాటు తిరుమలేశుని  సన్నిధి అయిన తిరుపతిలో కూడా మీరు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు స్కామాంధ్ర కావాలా లేక స్కీమాంధ్ర కావాలా అని ఉద్వేగంగా మీరు  ప్రశ్నించారు.  స్కీం లు ఏమయ్యాయని జయదేవ్ పేర్కొన్నారు.

విభజనలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అడిగేది రు. 1.54 లక్షల కోట్లు. మీరిచ్చింది కేవలం రు. 13,742కోట్లు. అంటే రెండు మూడు శాతమేనా. హామీలు అమలుచేస్తున్నామని ఢంకాభజాయిస్తున్నారు, ఇందుకేనా, ప్రధానిగారూ….. ఇది న్యాయమా???

వైసిపి ఎంపిలు మీ అతిథుల జాబితాలోకెక్కారు, మిత్రపక్షమయిన తెలుగుదేశం ఎంపి నిఘా లిస్టులో ఉంచుతారా?అని  జయదేవ్ ప్రశ్నించారు.

మాట ఇస్తే దాని మీద నిలబడి అమలుచేసే దమ్ము ఉండాలన్నాడు.  దీనికోసం ’భరత్ అనే నేను’ సినిమా కథను కూడా ప్రస్తావించారు. ఇచ్చిన మాట నిలుపుకొనని మనిషి మనిషే కాదు పొమ్మన్నారు. సినిమాలోకి ఈ మాటను ఆంగ్లంలో కూడా ప్రధాని అర్థమయ్యే లా చెప్పారు.

’మీ మాటలు వినివిని ఆంధ్రప్రజలు విసిగెత్తారు. చేసిన ప్రమాణాలు నిలపుకోలేదని ఆంధ్రులు గుర్తించారు. ఇంత సులభంగా ఇచ్చిన హామీలను మోదీ, ఆరుణ్ జైట్లీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా  ఎలా మర్చిపోతారు,’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 

 

 

ఇవి కూడా చదవండి

మోదీ, జైట్లీ చెప్పిన పది అబద్దాలు : జయదేవ్

 

 

జయదేవ్ ను పదే పదే అడ్డుకున్న స్పీకర్

 

హైదరాబాద్ నాటి ఆంధ్రులందరి సృష్టి