పండగ పూట విషాదం… కరెంట్ షాక్ తో మృతిచెందిన తల్లీ కూతుర్లు!

వినాయక చవితి సందర్భంగా దేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. అందరి ఇళ్లల్లోనూ వినాయక చవితి పండుగను చాలా ఘనంగా జరుపుకున్నారు. కొంతమందికి మాత్రం ఈ వినాయక చవితి పండగ విషాదంగా మిగిలింది. పండగపూట ఆనందంతో ఉండాల్సిన ఇల్లు విషాదంతో మిగిలిపోయింది. వినాయక చవితి రోజున కరెంట్ షాక్ తగలడం వల్ల తల్లి కూతుర్లు మరణించటమే కాకుండా వారిని కాపాడేందుకు వెళ్లిన తండ్రి కూడా ప్రమాదంలో పడి ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ విషాద ఘటన కోటపల్లి మండలం బొప్పారం గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే …కోటపల్లి మండలం బొప్పారం గ్రామంలో జెల్ల సమ్మయ్య తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. బుధవారం వినాయక చవితి పండుగ ఉండటంవల్ల ఇంటి సభ్యులందరూ ఎంతో ఆనందంగా పండుగ సంబరాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకోని ఘటన వల్ల ఆ కుటుంబంలో పండగ వాతావరణం పోయి విషాదం అలుముకుంది. వినాయక చవితి పండగ రోజున ఇంట్లో సమ్మయ్య భార్య సరిత అతని ఏడాది వయసున్న కుమార్తె కరెంటు షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు.

ఈ క్రమంలో భార్యాబిడ్డని కాపాడటానికి సమ్మయ్య తీవ్ర ప్రయత్నాలు చేశాడు ఈ మేరకు సమ్మయ్య కూడా కి షాక్ కి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే సమ్మయ్య తో పాటు అతని భార్య బిడ్డని కూడా ఆసుపత్రికి తరలించగా భార్యాబిడ్డలు మరణించారని డాక్టర్లు నిర్ధారించి సమ్మయ్యకి చికిత్స అందిస్తున్నారు. కరెంట్ షాక్ వల్ల తీరగాయాల పాలవటంతో సమ్మయ్య చావ బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సమ్మయ్య భార్య కూతురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పండగపూట సాంబయ్య కుటుంబంలో ఇలా ప్రమాదం జరగటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.