గుంటూరు జిల్లాలో విషాదం

గుంటూరు జిల్లాలో విషాదం జరిగింది. తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామం వద్ద కృష్ణానదిలో పడిపోయి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. కృష్ణానదిని చూడటానికి 8 మంది విద్యార్ధులు వచ్చారు. ప్రమాదవశాత్తు నలుగురు విద్యార్ధులు జారిపడటంతో నదిలో కొట్టుకుపోయారు. మిగిలిన విద్యార్ధులు కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి కాపాడే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు రక్షణ బృందాలతో గాలింపు చేపట్టగా కిలోమీటరు దూరంలో విద్యార్ధుల మృతదేహాలు దొరికాయి. మృతులను తాడేకోరు శివ (14), నీలం క్రాంతి కుమార్(10) నీలం శశి(8) దినేష్ (7) గా గుర్తించారు. సెలవు దినం కావడంతో సరదాగా నదిని చూద్దామని వచ్చిన విద్యార్ధుల యాత్ర విషాద యాత్రగా మారింది. మృతులంతా చిర్రావూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.