నువ్వు అందంగా లేవు.. నీ చెల్లెను పంపు.. భార్యకు భర్త వేధింపులు

ఏడు నెలల క్రితం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. సజావుగానే కాపురం సాగుతుంది. అత్తగారింటికి వచ్చి వెళ్లే సమయంలో ఆయనగారి మనసు పెళ్లి కానీ మరదలు మీద పడింది. నీవు అందంగా లేవు.. నీ చెల్లే నీకంటే బాగుంది. నువ్వు వెళ్లిపో.. నీ చెల్లెలిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి.. అంటూ భర్త నిత్యం వేధిస్తూ సూటి పోటి మాటలు అనడంతో ఆమె తట్టుకోలేక పోయింది. అతని పై పోరాడలేక తానే తనువు చాలించింది. అసలు వివరాలు తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే…   

కర్నూలు జిల్లా కోసిగికి చెందిన లక్ష్మీ, కిష్టప్ప దంపతుల కూతురు లింగమ్మను ఏడు నెలల క్రితం పల్లెపాడుకు చెందిన మల్లేష్ ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన కొంత కాలం నుంచే నీవు మంచిగా లేవు.. నీ చెల్లి నీకన్నా బాగుంది. తనను నాకిచ్చి పెళ్లి చేసేలా మీ తల్లిదండ్రులను ఒప్పించాలని లేకపోతే పుట్టింటికి వెళ్లి పోవాలని మల్లేష్ లింగమ్మను వేధించాడు.

లింగమ్మను శారీరకంగా, మానసికంగాను వేధించడంతో ఆమె తన పుట్టింట్లో ఏం చెప్పలేకపోయింది. ఎక్కడ పరువు బజారున పడుతుందో అని అసలే తమది పేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరని లింగమ్మ ఆలోచించింది.  అయినా కూడా రోజు రోజుకు మల్లేష్ వేధింపులు ఎక్కువయ్యాయే కానీ తగ్గలేదు.

ఆత్మహత్యకు పాల్పడ్డ లింగమ్మ

దీపావళి పండుగకు అమ్మగారింటికి లింగమ్మ వచ్చింది. పండగ తర్వాత అత్తగారింటికి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు లింగమ్మను ప్రశ్నిండంతో అసలు విషయం చెప్పింది. దీంతో ముందు నువ్వు అత్తగారింటికి వెళ్లమని ఆ తర్వాత తాము  పెద్ద మనుషులను తీసుకోని వస్తామని లింగమ్మకు నచ్చచెప్పారు. అత్తగారింటికి వెళ్లడం ఇష్టం లేని లింగమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లింగమ్మ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.