కన్నతండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన కొడుకు.. కారణం ఏమిటంటే?

ప్రస్తుత కాలంలో కొంతమంది పిల్లలు మాత్రం తల్లిదండ్రుల కష్టానికి విలువ లేకుండా చెడు వ్యసనాలకు బానిసలు అవుతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అయితే ఎలా పిల్లలే కాకుండా కొంతమంది తండ్రులు కూడా చెడు వ్యసనాలకు బానిసై కుటుంబ సభ్యులకు సమస్యగా మారుతున్నారు. మద్యానికి బానిసైన తండ్రిని కన్నకొడుకే కిరాతకంగా హత్య చేసిన ఘటన హర్యానాలో ఇటీవల చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…హర్యానాలోని పానిపట్ నగరంలోని న్యూ వికాస్ నగర్‌లో రాజ్‌పాల్ అనే వ్యక్తి తన కొడుకు సుమిత్ తో కలిసి నివసిస్తున్నాడు. రాజ్ పాల్ మద్యానికి బానిసై రోజు మద్యం సేవించి ఇంటికి వెళ్లి కొడుకుతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇటీవల కూడా ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లిన రాజ్ పాల్ కొడుకుతో వాగ్వాదానికి దిగాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ పెరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. తండ్రి ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన సుమిత్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని రాజ్ పాల్ . దీంతో రాజ్ పాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సుమిత్ ని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో సుమిత్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.