పోలీస్ ఆఫీసర్ ఇంట్లో దొంగతనం.. దొంగల్ని పట్టుకోవడానికి ఆ పోలీస్ చేసిన పని తెలిస్తే షాక్..?

సాధారణంగా దొంగతనాలు చేసేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైనా ఇంటికి దొంగతనానికి వెళ్లే ముందు ఆ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకొని మరి దొంగతనానికి వెళుతూ ఉంటారు. అయితే ఇటీవల ఒక దొంగ ఏకంగా పోలీస్ ఆఫీసర్ ఇంట్లోకి చొరబడి 40 తులాల బంగారం మూడు లక్షల రూపాయల నగదు దొంగలించాడు. తన ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించిన ఆ పోలీస్ ఆఫీసర్ దొంగలను పట్టుకోవడానికి చేసిన పని పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటు. ఈ సంఘటన హర్యానా లో వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో
చాందినీ బాగ్ పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఏఎస్సై కృష్ణకుమార్ ఇంట్లో డిసెంబర్ 23 వ తేదీన దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు 40 తులాల బంగారు నగలతో పాటు మూడు లక్షల రూపాయల నగదు దొంగలించారు. ఇలా తన ఇంట్లోనే దొంగతనం జరగటంతో ఈ ఏఎస్‌ఐ తాను పనిచేస్తున్న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దొంగల ఆచూకీ తెలుసుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం ఫలితం లేకపోవడంతో ఎలాగైనా దొంగల ఆచూకీ తెలుసుకోవాలని చేయాలంటూ పండోఖర్ బాబా ఆశ్రమానికి వెళ్లారు.

అక్కడికి వెళ్లి బాబా కాళ్ళ దగ్గర కూర్చొని తన ఇంట్లో జరిగిన చోరీ గురించి ఆయనకు వివరించి, దొంగలను పట్టుకోవడంలో సాయం చేయాలని కోరారు. ఏఎస్ఐ సమస్య తెలుసుకున్న బాబా వెంటనే స్పందించి దొంగలను పట్టుకోవడానికి ఈ పోలీసు అధికారికి మంచి క్లూ అయితే ఇచ్చారు కానీ… గ్యారంటీ మాత్రం ఇవ్వలేదు. ఇంతకీ బాబా క్లూ ఏమిటంటే.. మీ పోలీస్ క్వార్టర్స్‌లోనే ఉందీ.. పంజాబ్ సరిహద్దులకు వెళ్తే దొంగలు దొరుకుతారని చెప్పి, చివరిలో గ్యారెంటీ లేదని చెప్పడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు తన ఇంటిని కాపాడకోలేకపోయిన ఈ పోలీస్ ఆఫీసర్ ప్రజలను ఎలా కాపాడుతాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.