హీరోయిన్ సిమ్రాన్ గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఏంటో తెలుసా?

సిమ్రాన్ ప్రముఖ సినీనటి. తెలుగు, తమిళంలో ఒక దశాబ్దం పాటు అగ్ర హీరోయిన్ గా పేరుపొందింది. 1979లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. వీరిది పంజాబీ కుటుంబం. ఈమెకు మోనాల్, జ్యోతి అనే ఇద్దరూ సోదరీమణులు, సుమిత్ అనే సోదరుడు ఉన్నాడు.2002లో మోనాల్ మరణించడం జరిగింది. ముంబైలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ లో అడుగు పెట్టింది.

2003లో చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను వివాహం చేసుకుంది. వీరికి ఆది, ఆదిత్య అనే ఇద్దరు కుమారులు సంతానం. దూరదర్శన్ లో వచ్చే సూపర్ హిట్ ముకాబలా కార్యక్రమంలో పాల్గొంది. సనమ్ హర్ జాయే అనే హిందీ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. తరువాత తేరే మేరే సప్నే అనే హిందీ చిత్రం ద్వారా ప్రేక్షకులకు చేరువైంది.

శరత్ దర్శకత్వం వహించిన అబ్బాయి గారి పెళ్లి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తరువాత ఇంద్రప్రస్థం అనే మలయాళ సినిమాలో నటించింది. దక్షిణాదిలో తెలుగు, తమిళ్ లో ఎక్కువగా సినిమాలలో నటించి, తమిళంలో లేడీస్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో వెంకటేష్ సరసన కలిసుందాం రా, బాలకృష్ణ తో నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు.

నాగార్జునతో నటించిన నువ్వొస్తావని చిత్రాలు ఎన్నటికీ మర్చిపోలేనివి. ఇలా పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొంది ఒక దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్గా జరిగింది. ఇక వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం కాకుండా కాస్త టచ్ లోనే ఉంది భర్తతో కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ని కూడా నిర్మించింది. సినిమాలలో లోనే కాక బుల్లితెరపై కూడా పలు సీరియస్లలో నటించింది. ఇక బాలకృష్ణతో ఒక్కమగాడు సినిమా, రజనీకాంత్ తో పేట సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.