కనికరం లేకుండా తల్లిదండ్రులను చంపి వారి పక్కనే నిద్రపోయిన కుమారుడు!

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి తల్లిదండ్రుల పట్ల ఎంతో రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులని ఆలోచన కూడా లేకుండా వారి పట్ల ఎంతో నీచంగా ప్రవర్తిస్తూ కొందరు తమ తల్లిదండ్రులను రోడ్డుమీద వదిలివేయగా, మరికొందరు నిర్ధాక్షణంగా చంపుతున్న ఘటనలు రోజు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభ కోణం సమీపంలోని పట్టీశ్వరం గ్రామానికి చెందిన గోవిందరాజ్‌, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె.

ఈ దంపతుల పెద్ద కుమారుడు ప్రమాదంలో మరణించారు. అలాగే కుమార్తె కూడా మరణించింది. ఇక రెండో కుమారుడు రాజేంద్రన్ కి వివాహం కాలేదు. అయితే తనకు పెళ్లి కాలేదన్న ఆలోచనలతో ఒక మానసిక రోగిగా మారిపోయి నిత్యం తన తల్లిదండ్రులను వేధిస్తూ ఉండేవాడు కొన్నిసార్లు వారిపై చేయి చేసుకొని తిరిగే వారి వద్ద ఉండేవారు. ఇలా తన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తరచూ తల్లిదండ్రులపై దాడికి దిగారు.

ఇకపోతే గత రెండు రోజుల క్రితం రాజేంద్రన్ ఏకంగా తన తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్టు కత్తితో పొడిచి చంపేయడమే కాకుండా వారి శరీర భాగాలను కూడా నరికి వేశాడు.ఇలా చనిపోయిన తల్లిదండ్రులను మంచంపై పడేసి తాను కూడా రెండు రోజులు పాటు తన తల్లిదండ్రుల పక్కనే పడుకున్నారు.అయితే రెండు రోజుల తర్వాత ఇంటి నుంచి తర్వాత రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులుతనని అరెస్టు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుంభకోణం ఆస్పత్రికి తరలించారు.

తల్లిదండ్రులను చంపేశాడు.. మృతదేహాలతోనే రెండు రోజులు..!@TV9TeluguDigital