ఆషాఢ మాసం చివరి ఏకాదశి ఈసారి భక్తులకు, జ్యోతిష్య పండితులకు, విశేషంగా రాశి ఫలాల కోసం ఎదురుచూస్తున్న వారికి మరింత ప్రత్యేకంగా మారనుంది. జూలై 21, సోమవారం రోజున జరగబోయే కామిక ఏకాదశి 144 ఏళ్ల తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగాన్ని తీసుకురానుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. శ్రీమహావిష్ణువు ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన ఏకాదశి తిథి ఈసారి కొన్ని రాశుల వారికి ఊహించని శుభయోగాలను కలిగించబోతోందని పండితులు చెబుతున్నారు.
కామికా ఏకాదశి అంటే: కామిక ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటే, ఈ తిథిలో శ్రీమహావిష్ణువు పూజలకు అపార ప్రాముఖ్యత ఉంది. భక్తులు ఈ రోజు శక్తి మేరకు సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని పండితులు విశ్వసిస్తున్నారు. శ్రద్ధ, భక్తితో ఏకాగ్రతతో చేయబడ్డ పూజలు మంచి ఫలితాలను అందిస్తాయని విశ్వాసం. ఈ ఏకాదశి వల్ల ద్వాదశ రాశులపై ప్రభావం ఉంటుందట. ముఖ్యంగా కొన్ని రాశులవారికి ఈ అరుదైన లక్ష్మీ నారాయణ యోగం అనేక శుభ ఫలితాలను కలిగిస్తుందని పండితులు తెలిపారు.
మేష రాశి: ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు కనిపిస్తాయి, కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. కొన్నిరోజులుగా వాయిదా పడుతున్న విదేశీ యాత్రకు అవకాశం వస్తుంది. రాజకీయంగా రాణించే అవకాశం పెరుగుతుంది. కోరుకున్న యువతితో పెళ్లి కుదరగలదని పండితులు తెలిపారు.
సింహ రాశి: ఇక సింహ రాశి వారికి ఇంతకాలం దూరంగా ఉన్న వ్యక్తులు మళ్లీ స్నేహానికి ముందుకొస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, బంధువులతో ఉన్న తగాదాలు పరిష్కారం కావడం, కొత్త ఇంటి కల నిజం కావడం వంటి శుభయోగాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎంతో కాలంగా రాని డబ్బులు కూడా తిరిగి వస్తాయని తెలిపారు.
ఈ ఏకాదశి రోజున పుణ్యకార్యాలు చేయడం, దాన ధర్మాలు చేయడం ద్వారా మరింత సానుకూలత పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభిస్తుందని, జీవితంలో స్థిరత్వం, సంపదలు స్థిరపడతాయని పండితులు తెలియజేస్తున్నారు. ఆషాఢ మాసం చివరి ఏకాదశి ఈసారి భక్తుల జీవితాల్లో కొత్త ఆశలు, ఆశీర్వాదాలను తీసుకొస్తుందని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు.
