ప్రేమించిన అమ్మాయి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందని అందరి ముందు దారడానికి పాల్పడిన వ్యక్తి..?

ప్రస్తుత కాలంలో యువతీ యువకులు చిన్న వయసులోనే ప్రేమలో పడుతున్నారు. ఏమీ తెలియని వయసులో ఇలా ప్రేమలో పడి మోసపోతున్నారు. కొంతమంది ప్రేమించిన వారి కోసం తల్లిదండ్రులను ఎదిరించి ఇంటి నుండి పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటుంటే మరి కొంతమంది మాత్రం తల్లిదండ్రుల గౌరవ మర్యాదల కోసం ప్రేమించిన వారికి దూరమవుతున్నారు. అయితే కొంతమంది యువకులు మాత్రం తమ ప్రేమను నిరాకరించిందని లేక తమని ప్రేమించి వేరొకరిని వివాహం చేసుకుందన్న కారణంతో యువతుల మీద దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది హత్యలు చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

తాజాగా ఇటువంటి దారుణ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, విజయనగర జిల్లాలోని పరపనహళ్లి తాలూకా, దుర్గావతి గ్రామానికి చెందిన హనుమంతు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ప్రతిభ అనే యువతి ప్రేమించుకున్నారు. అయితే, వీరి పెళ్లికి ప్రతిభ కుటుంబసభ్యులు నిరాకరించారు. ఆ తర్వాత ఆమెను రాణబెన్నూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ప్రేమించిన ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవటంతో హనుమంతు కోపంతో సైకోగా మారాడు.

అయితే ప్రతిభ మాత్రం ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత ప్రతిభ సంతోషంగా జీవనం సాగిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా, ఆమె తన పిన్ని ఊరిలో జరుగుతున్న జాతరకు వెళ్లింది. హనుమంతు కూడా అదే జాతరకు వెళ్ళాడు. అయితే జాతరలో ఆమెను చూసిన హనుమంతు ఆగ్రహంతో ఊగిపోతూ అందరూ చూస్తుండగానే కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేసి చేశాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన ప్రతిభ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.