విడాకులు కోరినందుకు నడిరోడ్డుపై భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త?

భార్య భర్తల అన్న తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు వస్తుంటాయి. కానీ ఇలాంటి చిన్న చిన్న గొడవలు పెద్దవి అయ్యి భార్య భర్తలు ఒకరి నుండి ఒకరు విడాకులు తీసుకొని విడిపోవడమే కాకుండా మరి కొంతమంది ఆత్మహత్యలు, హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. భర్త వేధింపులు భరించలేక విడాకుల కోరినందుకు అందరి ముందు నడిరోడ్డుపై కిరాతకంగా భర్త హత్య చేసిన ఘటన ఇటీవల ముంబైలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…ముంబయిలోని చెంబూర్‌లో నివాసముంటున్న ఇగ్బాల్ అనే వ్యక్తి టాక్సీ నడుపుతూ జీవనం సాగేస్తున్నాడు. మొదటి భార్యకు పిల్లలు పుట్టక పోవడంతో ఆమెని వదిలేసి వేరే మతానికి చెందిన రూపాలీ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వివాహం ఆమెను బురఖా వేసుకోవాలని, ఇతర ముస్లిం సంప్రదాయాలనూ పాటించాలంటూ ఇక్బాల్‌ కుటుంబ సభ్యులు ఆమెని ఒత్తిడి చేశారు. దీంతో వారు పెట్టే వేధింపులు భరించలేక విడాకులు కావాలని కోరుతూ.. తన కుమారుడిని తీసుకొని దాదర్ లోని ఒక హాస్టల్లో స్నేహితులతో కలిసి నివసిస్తోంది.

ఇటీవల రూపాలీ వద్దకు వెళ్లిన ఇక్బాల్ కుమారుడి విషయం మాట్లాడాలని ఆమెను బయటకు పిలిపించాడు. ఆమె బయటికి వచ్చిన తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో నడిరోడ్డుపై దారుణంగా ఆమెను పొడిచి అక్కడి నుండి పారిపోయాడు. తీవ్ర గాయాల పాలైన రూపాలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.