తిరుపతి జిల్లాలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఏర్పేడు మండలం జంగాలపల్లి గిరిజన కాలనీలో ఏడేళ్ల బాలుడు మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదు. బాలుడి కోసం వెతికిన తల్లిదండ్రులకు బుధవారం ఉదయం పక్క ఊరిలో ఉన్న నదిలో శవమై కనిపించాడు. కుమారుడు ఇలా అనుమానాస్పద స్థితిలో చెరువులో శవమైతేలటంతో ఆ తల్లితండ్రులు రోజున వర్ణాతీతంగా మారింది.
పోలిసులు తెలిపిన వివరాల మేరకు…. గిరిజన కాలనీలో నివసించే జయకృష్ణ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మంగళవారం ఉదయాన్నే జయ కృష్ణ కుమారుడు ప్రసాద్ పాఠశాలకి వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రసాద్ క్లాస్ రూమ్ లో కనిపించకపోవడంతో ఉపాధ్యాయులు బాలుడు ఇంటికి వెళ్లి ఉంటాడని భావించి మిన్న కుండిపోయారు.కూలి పనికి వెళ్ళిన జయకృష్ణ సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా బాలుడు ఇంకా పాఠశాల నుండి రాలేదు. చుట్టుపక్కల వారిని అందరిని అడగగా ఎవరు బాలుడి ఆచూకీ తెలపలేదు. పరిసర ప్రాంతాల్లో వెతికినా కూడా ఎటువంటి ఉపయోగం లేకపోయింది.
దీంతో బుధవారం ఉదయం పక్క ఊరైన పంగూరులో వెతకడానికి వెళుతుండగా మార్గమధ్యంలో జంగాలపల్లి చెరువులో బాలుడి మృతదేహం కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. డిఎస్పి రవిచంద్ర, సీఐ శ్రీహరి, ఎస్సై రఫీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలుడు తలపై బలమైన గాయం ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో ఈ ఘటనని అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పండుగ పూట బాలుడు మృతితో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.