R Narayana Murthy: ప్రతి గ్రామానికి గుడి, బడి, ఆస్పత్రి అవసరమంటున్న ఆర్.నారాయణ మూర్తి!

R Narayana Murthy: తెలుగు సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి తాజాగా తన స్వస్థలమైన రౌతులపూడి మండల కేంద్రంలో జరిగిన శివాలయపునః ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన అక్కడ కొన్ని విషయాలను పంచుకున్నాడు. ప్రతి గ్రామానికి గుడి, బడి, ఆస్పత్రి అవసరం అంటూ.. గుడి ఉంటే మనిషి పాపభీతి తో తప్పులు చేయకుండా ఉంటాడని..

బడి ఉంటే చదువు ద్వారా జ్ఞానం ఉంటుందని, ఆస్పత్రి ఉంటే అనారోగ్య సమస్య ఉన్నవాళ్లు కుదుటపడుతారని అన్నాడు. ఇక ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రజలు కూడా రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. అంతేకాకుండా ఆలయా ఏర్పాట్లకు సంబంధించిన కొన్ని విషయాల గురించి కూడా పంచుకున్నాడు.