కూతురు పుట్టిందని అందరికీ స్వీట్లు పంచారు… కట్ చేస్తే కవర్లో శిశువు శవం!

ప్రస్తుత కాలంలో అన్ని రంగాల్లోనూ అబ్బాయిలతో పోటీగా అమ్మాయిలు కూడా రాణిస్తున్నారు. అయినప్పటికీ బాలికల పట్ల వివక్ష మాత్రం తగ్గటం లేదు. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలను భారంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది లోకం కూడా చూడని పసిబిడ్డలను చెత్తకుప్పలలో పడేస్తూ భారం దించుకుంటున్నారు. నవ మాసాలు మోసి కన్న తల్లులు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల రాజస్థాన్ లో కూడా ఎటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. కొడుకే పుట్టాలన్న కోరికతో ఉన్న తల్లిదండ్రులకు కూతురు పుట్టడంతో ఆ చిన్నారిని వదిలించుకోవడానికి స్వీట్లు తెచ్చిన కవర్లో కుక్కి దారుణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే…రాజస్థాన్ కి చెందిన దంపతులకు ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. అయితే కొడుకు పుడతాడని ఎంతో ఆశగా ఉన్న ఆ దంపతులు కొడుకు పుట్టడంతో చాలా నిరాశ చెందారు. అయినప్పటికీ బంధువులు కుటుంబ సభ్యుల ముందు సంతోషంగా ఉన్నట్లు నటించి అందరికీ స్వీట్లు కూడా పంచిపెట్టారు. బంధువులందరూ కూడా కూతురు పుట్టడంతో చాలా ఆనందంగా ఉన్నారు. అయితే కొడుకు కావాలని కోరిక బలంగా ఉండటంతో ఆ తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన పసిబిడ్డను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సీట్లు తెచ్చిన కవర్లోనే పసిబిడ్డను బలవంతంగా కుక్కి ఎముకలు కొరికే చలిలో దూరంగా ఉన్న పొలాల్లో విసిరేశారు. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఆస్పత్రి నుండి మాయమయ్యారు.

సోమవారం ఉదయం జిల్లాలోని బుహానా భిర్ రహదారి పక్కన దూరంగా ఉన్న పొలాల్లో అప్పుడే జన్మించిన శిశువు ఉందని పోలీసులకు సమాచారం తెలియటంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ఒక కవర్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డ జీవచ్ఛవంలా పడి ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.