‎Bollywood: తల్లిదండ్రులైన కియారా-సిద్ధార్థ్‌ మల్హోత్ర.. పోస్ట్ వైరల్!

‎Bollywood: బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు సిద్ధార్థ్. షేర్షా చిత్రంలో సిద్ధార్థ్‌, కియారా క‌లిసి న‌టించారు. 2021లో ఈ చిత్రం విడుద‌లైంది. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. కాగా ఇట‌లీలోని రోమ్‌లో సిద్ధార్థ్ త‌న‌కు ల‌వ్ ప్ర‌పోజ్ చేసిన‌ట్లు కియారా తెలిపింది. ఇక ఈ జంట కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో 2023 ఫిబ్ర‌వ‌రి 7న రాజ‌స్థాన్‌ లో ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

‎ ఇది ఇలా ఉంటే పెళ్లి అయిన తర్వాత కూడా ఈ జంట ఎవరికి వారు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు తల్లిదండ్రులు అయ్యారు. ముంబైలోని రిల‌య‌న్స్ ఆస్ప‌త్రిలో కియారా తాజాగా ఒక పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. అయితే త‌ల్లి, బిడ్డ ఇద్ద‌రూ ఆరోగ్యంగా ఉన్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా సెల‌బ్రెటీల‌తో పాటు ఫ్యాన్స్ ఈ జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇదే విషయాన్ని సిద్ధార్థ్, కియారా జంట అధికారికంగా ప్రకటించారు.

https://www.instagram.com/p/DMJ8hQbqCnk/?utm_source=ig_web_copy_link

‎కాగా కియారా, సిద్ధార్థ్ జంట‌కు ఇదే తొలి సంతానం. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఈ జంట ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకోవడంతో అభిమానులు బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే.. కియారా అద్వానీ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. ఈ సినిమాలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు కలిసిన నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక సిద్ధార్థ్ విషయానికి వస్తే. సిద్ధార్థ్‌ మల్హోత్రా, జాన్వీ కపూర్‌ జంటగా న‌టించిన పరమ్‌ సుందరి ఈనెల 25న రిలీజ్ కానుంది.