హైదరాబాద్ తార్నాక నారాయణ కళాశాల డీన్ శ్రీనివాసరావు వేధింపులు తాళలేక కళాశాల ఉద్యోగి ఫాతిమా అతనిని నిలదీసింది. డీన్ గా వ్యవహరిస్తున్న శ్రీనివాసరావు కాసులకు కక్కుర్తి పడి 12 మంది ఉద్యోగులకు నోటిసులు ఇవ్వకుండానే టిచింగ్, నాన్ టిచింగ్ స్టాఫ్ ను తొలగించారని ఫాతిమా తెలిపింది. శ్రీనివాసరరావు మహిళా లెక్చరర్ లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. స్టూడెంట్స్ దగ్గర కూడ ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేశారని, కొంత మంది విద్యార్ధినులను కూడా వేధించారని తెలిపింది.
శ్రీనివాసరావు గతంలో తనను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడని అతనికి లొంగకపోవడంతో కావాలని ఉద్యోగంలో నుంచి తొలగించాడని ఫాతిమా ఆరోపించింది. దీంతో ఇతరుల సహాయంతో కాలేజికి వెళ్లి శ్రీనివాసరావును ప్రశ్నించింది. గల్లా పట్టి గుంజి నిలదీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఫాతిమాకు అండగా ఓయూ విద్యార్ది సంఘ నాయకులు నిలిచారు. పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫాతిమాకు మద్దతుగా విద్యార్ధి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్, కల్వకుర్తి ఆంజనేయులు, గుండు కరుణాకర్, పిడిఎస్ యూ రంజిత్, నాము నాయక్, నిలిచారు. శ్రీనివాసరావును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం లోగా డీన్ ను తొలగించకపోతే నారాయణ కాలేజిని ముట్టడించి ఆందోళన చేస్తామని చనగాని దయాకర్ హెచ్చరించారు.
బాధితురాలు ఫాతిమా మీడియాతోె మాట్లాడారు ఆమె ఏమన్నారంటే…
“తార్నాకలోని నారాయణ కాలేజిలో లెక్చరర్ గా పని చేస్తున్నాను. ఇక్కడ డీన్ శ్రీనివాసరావు లైంగికంగా వేధించేవాడు. నాతోపాటు అనేక మంది మహిళా ఉద్యోగులను వేధించాడు. పరువు పోతుందని ఎవరికి చెప్పుకోలేదు. అతనిని మేం గట్టిగానే ప్రతిఘటించాం. ఇది మనసులో పెట్టుకొని 12 మంది ఉద్యోగులకు ఎటువంటి నోటిసులు లేకుండా ఉద్యోగంలో నుంచి తీసేశాడు. యాజమాన్యం కూడా ఎందుకు తీసేశారో వివరణ ఇవ్వలేదు. నారాయణ కాలేజిలో దాదాపు సగం ఇలాంటి వాళ్లే ఉన్నారు. వాళ్లకు లొంగితే అందలమెక్కిస్తారు. లేకపోతే పనిలోనుంచి తీసేస్తారు. స్టూడెంట్స్ నుంచి కూడా అక్రమంగా డబ్బులు వసూలు చేశారు. కొంత మంది విద్యార్ధినులను కూడా వేధించారు. తక్షణమే ఇటువంటి వారి పై చర్యలు తీసుకోవాలి. మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలి” అని ఫాతిమా అన్నారు.
ఫాతిమా డీన్ శ్రీనివాసరావును నిలదీసిన వీడియో కింద ఉంది చూడండి