Narayana: మూడు పెళ్లిళ్లు చేసుకోవడ సనాతన ధర్మమా… పవన్ కు కౌంటర్ ఇచ్చిన నారాయణ?

Narayana: సీపీఐ నారాయణ మీడియా ముందుకు వస్తే చాలు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు అయితే తాజాగా ఈయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్న విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్లను జైల్లో పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పదే పదే మాట్లాడుతున్నారు.

ఇలా సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్లను జైల్లో పెట్టాల్సి వస్తే ముందుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని జైల్లో పెట్టాలి అంటూ నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం(ఇస్కఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో నారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సనాతన ధర్మం గురించి ప్రస్తావన రావడంతో ఈయన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

సనాతన ధర్మంలో విడాకులు ఉండవని చెప్పారు. ఎప్పుడూ సనాతనం గురించి మాట్లాడే పవన్‌ కల్యాణ్‌ ముగ్గురు భార్యలను ఎందుకు మార్చారని నిలదీశారు. పవన్‌ చెప్పేదాన్ని బట్టి మొట్టమొదట జైల్లో పెట్టాల్సింది ఆయననే అంటూ నారాయణ మాట్లాడారు.సనాతన ధర్మంలో సతీసహగమనం ఉందని, దాన్ని ఒప్పుకొంటారా అంటూ నారాయణ ప్రశ్నించారు. ఈ విధంగా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఈయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా తన మూడవ భార్య క్రిస్టియన్ కావడం విశేషం. ఇలా ఇతర కులమతాలకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటంతో పలువురు ఇదే విషయంపై పవన్ పట్ల విమర్శలు కురిపిస్తున్నారు.