జెసి దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం

అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరిగిన తర్వాత తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అనంతపురం అభివృద్దిపై తనకు అభ్యంతరాలున్నాయని, ప్రభాకర్ చౌదరికి ఇచ్చిన విలువ తనకు ఇవ్వటం లేదని జెసి ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటుకు హాజరు కానని ఇప్పటి వరకు చర్చగా మారిన జెసి రాజీనామా నిర్ణయంతో మరో చర్చకు తెరలేపారు.