నెల్లూరు పెద్దాసుపత్రిలో రేడియాలజిస్టును నియమించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చింది. మొన్న ఆయన ఆసుపత్రి సందర్శించిన అక్కడి స్థితిగతుల మీద రోగులతో మాట్లాడారు. అక్కడ వసతులేవీ లేకపోవడమే కాకుండా రేడియాలజిస్టు లేని విషయం కూడా వెల్లడయింది. దీనితో ఆయన రేడియాలజిస్టు నియమించేదాకా అక్కడి నుంచి కదలనని ధర్నాకు దిగారు. అధికారులు పరిగెత్తు కుంటూవచ్చి వెంటనే రేడియాలజిస్టును నియమిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన ధర్నా విరమించుకున్నారు. ఈ రోజు రేడియాలజిస్టు నియమించి ఇచ్చిన హామీని అధికారులు నిలబెట్టుకున్నారు. దీనికి ఉన్నతాధికారులనురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందించారు.
ఇదే త్రాగునీళ్ళు, మరుగుదొడ్డి, కరెంటు, లిఫ్ట్ సమస్యలను 26వ తేదీ లోపు పరిష్కరిస్తామని, ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవాలని ఆయన అధికారులకు గుర్తు చేశారు.
జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను 15 రోజుల్లో భర్తీ చేసి, మాటను నిలబెట్టుకోవాలని కూాడా ఆయన అధికారులను కోరారు.
డాక్టర్ల కొరత సమస్య పరిష్కరించకుండా పెద్దాసుపత్రి బాగుకోసం కెమెరాలముందు చిందులేస్తే ఉపయోగం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు
కోటం రెడ్డి ఈ మధ్య రోజుకో ధర్నా చేయాల్సి వస్తుంది. ఆయన సాగిస్తున్న 366 రోజు ప్రజాప్రస్థాన యాత్రలో కాలనీ లో తిరుగుతున్నపుడు అక్కడి సమస్యల మీద ఆయన ధర్నా చేయడం, సమస్య పరిష్కరించేదాకా నేనిక్కడ నుంచి కదలనని ఆయన మొరాయించడం, అధికారులు పరిగెత్తు కుంటూరావడం సమస్య పరిష్కరించడం రివాజు అయింది.
అంటే నెల్లూరు నియోజకవర్గంలో కోటంరెడ్డి ధర్న చేస్తేతప్ప ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదనేనా అర్థం.