సుందర్‌ దర్శకత్వంలో ‘అరణ్మై4’

సుందర్‌.సి స్వీయదర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్ట్‌ అరణ్మనై 4 . ఇప్పటికే మేకర్స్‌ ‘అరణ్మనై 4’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ లాంఛ్‌ చేయగా.. తల్లి తన కుమారుడు, కూతురును ఓ ఇంట్లోకి తీసుకెళ్తున్న లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అరణ్మనై ఫ్రాంచైజీలో వస్తోన్న ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు.

చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ ఆసక్తికర వార్తను షేర్‌ చేసింది మేకర్స్‌ టీం. తాజాగా మరో లుక్‌ విడుదల చేశారు. కొందరంటారు ఈ ఖరీదైన విల్లా చలిగా ఉంటుందని, ఈ భవంతి చాలా చల్లగా ఉంటుందని మరికొందరు చెబుతారు.

ఈ ఏప్రిల్‌లో ‘అరణ్మనై 4’ వేసవికి చక్కటి నవ్వుతోపాటు చల్లదనాన్ని, థ్రిల్‌లను అందించేందుకు వస్తోంది. కావున విూరంతా సిద్ధంగా ఉన్నారా? అంటూ కొత్త పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్‌. ఫొటో ఫ్రేమ్‌లో సుందర్‌ సీ, కోవై సరళ, యోగి బాబు కనిపిస్తుండగా.. మరోవైపు తమన్నా, రాశీ ఖన్నా, ఓ విల్లా, దాని ముందు కారును చూడొచ్చు. ‘అరణ్మనై 4’ చిత్రంలో కోవై సరళ, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంతకీ ఈ మూవీ విడుదల తేదీ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.