నితిన్‌ ‘రాబిన్‌హుడ్‌’ గ్లింప్స్‌!

‘భీష్మ’ తర్వాత టాలీవుడ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ వెంకీ కుడుముల, నితిన్‌ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందని తెలిసిందే. ఈ మూవీ టైటిల్‌ను ప్రకటిస్తూ ‘రాబిన్‌హుడ్‌’ గ్లింప్స్‌ వీడియోను కూడా షేర్‌ చేయగా.. నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ కోసం మొదట రష్మిక మందన్నా పేరు తెరపైకి రాగా.. ఆ తర్వాత శ్రీలీల పేరు బయటకు వచ్చింది.

తాజాగా మరో భామ పేరు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘రాబిన్‌హుడ్‌’లో రాశీఖన్నాను కీ రోల్‌ కోసం తీసుకున్నట్టు ఫిలింనగర్‌ సర్కిల్‌ టాక్‌. ఇదే నిజమైతే శ్రీనివాస కల్యాణం తర్వాత నితిన్‌, రాశీఖన్నా కాంబోలో వస్తున్న రెండో సినిమా కానుంది. మరి శ్రీలీల ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో కనిపించనుందా..? లేదంటే రాశీఖన్నానే హీరోయిన్‌గా కొనసాగుతుందా.. అనేది తెలియాలి.

”డబ్బు చాలా చెడ్డది.. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావే అంటే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది. అన్నట్టే చేసింది.. దేశమంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ముళ్లు. ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్కాచెల్లెళ్లు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్‌ అని కూడా చూడకుండా నా విూద కేసులు పెడుతున్నారు…” అంటూ సాగుతున్న గ్లింప్స్‌ వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.