కేరళ దెబ్బతో, అర్ధరాత్రి ఏపీ ప్రజల్ని బెదరగొట్టిన అధికారులు

కేరళ వరద భీభత్సం సృష్టించిన నష్టం ఘోరమైనది. కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళ వరద బీభత్సాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తు చర్యలు ముమ్మరం చేశారు. ఎంతలా అంటే ప్రజలు బెంబేలెత్తే రీతిలో హెచ్చరికలు జారీ చేశారు.

భారీవర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఫోన్ కాల్స్ చేశారు. రియల్ టైం గవర్నెన్స్ పేరిట ప్రజలకు వాయిస్ రికార్డ్ కాల్స్ చేశారు. కూనవరం, చింతూరు, వీఆర్ పురం ప్రాంతాల్లో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ కాల్స్ వెళ్లాయి. అర్ధరాత్రి సమయంలో అధికారుల ఫోన్ కాల్స్ కి జనం కంగారు పడ్డారు.