బస్సు చక్రాల కింద నలిగిన తల్లి,కొడుకు (వీడియో)

వరంగల్ జిల్లా కేంద్రంలో విషాదం జరిగింది. హన్మకొండ చౌరస్తాలో నడుచుకుంటూ పోతున్న తల్లి,కొడుకులను బస్సు ఢీకొనడంతో ఇద్దరూ చనిపోయారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ప్రమాదం జరిగిన వీడియో కింద ఉంది చూడండి.

వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన నామని సరిత దంపతులు వరంగల్ లో ఉంటున్నారు. సరిత భర్త కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. సరితకు ఇంటర్ నెట్ లో పని ఉండటంతో తన కుమారుడు రుత్విక్ తో కలిసి నడుచుకుంటూ హన్మకొండ చౌరస్తా వైపు వెళుతుంది. అక్కడే రాంగ్ రూట్ లో యూటర్న్ తీసుకుంటున్న హన్మకొండ డిపోకు చెందిన బస్సు వీరిని ఢీకొని వారిపై నుంచి వెళ్లింది. దీంతో రుత్విక్ అక్కడికక్కడే చనిపోగా సరిత హాస్పిటల్ కు తీసుకెళుతుండగా చనిపోయింది. వీరికి పది అడుగుల వెనుకే ఉన్న సరిత భర్త తన కళ్ల ముందే ఘోరం జరగడంతో కన్నీరు మున్నీరయ్యాడు. సంఘటన చూసి స్థానికులు కన్నీరు పెట్టారు. హృదయ విదారకంగా హన్మకొండ చౌరస్తా ప్రాంతం తయారైంది. నిర్లక్ష్యంగా బస్సును నడిపిన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రమాదం ఇలా జరిగింది

విగత జీవులుగా తల్లి,కొడుకు