మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ పట్టుబడ్డ డిఎస్పీ

ఆయన సమాజానికి మంచి చెప్పాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న డిఎస్పీ. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాల్సిన ఉద్యోగంలో ఉన్న ఆయనే తప్పు చేశాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆ మహిళ భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఇంతకీ పూర్తి వివరాలేంటంటే…

మంగళగిరి బెటాలియన్ కమాండెంట్ గా డిఎస్పీ దుర్గా ప్రసాద్ పని చేస్తున్నారు. ఆయన అంతకు ముందు హైదరాబాద్ లో పని చేశారు. అక్కడే వీరి ఇంటి పక్కకు రెడ్డి ప్రసాద్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో ఉండేవారు. రెడ్డి ప్రసాద్ ఓ పార్మా కంపెనీలో పనిచేసేవారు. ఇంటి పక్కనే కావడంతో డిఎస్పీ తరచు వారి ఇంటికి వెళుతుండేవారు. ఈ క్రమంలో రెడ్డి ప్రసాద్ భార్యతో దుర్గా ప్రసాద్ కు పరిచయం ఏర్పడింది.

రెడ్డి ప్రసాద్ కు టిటిడిలో ఉద్యోగమిప్పిస్తానని రెడ్డి ప్రసాద్ భార్యను దుర్గా ప్రసాద్ నమ్మించాడు.   తిరుచానూరుకి మీరు మారాలని త్వరలోనే జాబ్ వస్తుందని చెప్పి వారిని హైదరాబాద్ నుంచి తిరుచానూర్ రప్పించాడు. వారు తిరుచానూర్ లోని  ఓ అపార్ట్ మెంట్ లో కిరాయి ఇల్లు తీసుకొని ఉంటున్నారు.

ఆరు నెలలు గడుస్తున్నా జాబ్ రాకపోవడంతో రెడ్డి ప్రసాద్ మళ్లీ తన పాత ఫార్మా కంపెనీ హైదరాబాద్ లో జాయిన్ అయ్యాడు. తన పిల్లలు తిరుచానూర్ లో చదువుతుండడంతో ఇబ్బంది కాకుండా ఆయన ఒక్కడే హైదరాబాద్ లో పని చేస్తూ ఉంటున్నాడు.

15 రోజులకోసారి ఇంటికి వచ్చి వెళ్లే వాడు. ఇది ఆసరాగా చేసుకున్న డిఎస్పీ దుర్గా ప్రసాద్ రెడ్డి ప్రసాద్ భార్యతో సాన్నిహిత్యం పెంచుకొని వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం తెలిసుకున్న రెడ్డి ప్రసాద్ తన భార్య ప్రవర్తనను మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.

ఆదివారం ఉదయం దుర్గా ప్రసాద్ తన భార్యతో కలిసి ఇంట్ల ఉన్నాడని పక్కా సమాచారం తెలుసుకున్న రెడ్డి ప్రసాద్ ఇంటికి చేరుకొని వారిని బయటికి రమ్మనగా వారు లోపలి నుంచి తలుపు తీయలేదు. దీంతో రెడ్డి ప్రసాద్ బయటి నుంచి తాళం వేసి పోలీసులు, ప్రెస్ ను పిలిపించారు. వారి సమక్షంలో తలుపులు తీయగా డిఎస్పీ దుర్గా ప్రసాద్ పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్ కు రావాలని పోలీసులు కోరగా కారులో వస్తానని చెప్పి వెళ్లారు.

రెడ్డి ప్రసాద్ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిఎస్పీ దుర్గాప్రసాద్ పరారై ఇంత వరకు స్టేషన్ కు రాలేదు. విషయం తెలుసుకున్న డిజిపి ఠాకూర్ రెడ్డి ప్రసాద్ ను ఉద్యోగం నుంచి క్రమశిక్షణా చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. డిఎస్పీ మహిళతో రాసలీలలు చేస్తూ దొరకటం సంచలనం సృష్టించింది. ఇద్దరి ఇష్టంతో వివాహేతర సంబంధం నేరం కాదన్న సుప్రీం తీర్పుతో ఏం చేయాలో తెలియక పోలీసులు మల్లగుల్లాలు పడ్డారు.