“పుష్ప 2” లో ప్రతీ సీన్ ఇంటర్వెల్ మాదిరి.. 

నో డౌట్ గా ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర వస్తున్నా పలు మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో అందులోని సీక్వెల్ చిత్రాల్లో అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మాసివ్ సీక్వెల్ చిత్రం పుష్ప 2 అనే చెప్పొచ్చు.

అయితే ఈ చిత్రం కోసం ఎప్పటికప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు సినీ వర్గాల్లో వస్తుండగా లేటెస్ట్ గానే సినిమాలో జాతర ఎపిసోడ్ అని అలాగే సినిమా ఓవర్సీస్ బిజినెస్ అంటూ చాలానే వచ్చాయి. అయితే వీటిని మించిన కిక్ ని మాత్రం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఇవ్వడం సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ గా మారడం స్టార్ట్ అయ్యింది.

అయితే తాను రీసెంట్ గా ఒక నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ  పుష్ప 2 పై కొన్ని కామెంట్స్ చేసాడు. పుష్ప 2 చాలా గ్రాండ్ గా ఉంటుంది అని డైరెక్టర్ సుకుమార్ చాలా తెలివిగా ఈ సినిమాని షేప్ ఫుట్ చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ పుష్ప 2 ఆశ్చర్యపరుస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రంలో ప్రతీ పదిహేను నిమిషాలకి ఒకసారి ఇదే సీన్ తర్వాత ఇంటర్వల్ అనే లెవెల్లో ఉంటుంది అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపాడు.

దీనితో పుష్ప 2 మాత్రం అనుకున్న దానికంటే చాలా బెటర్ గా రాబోతుంది అని చెప్పి తీరాలి. అయితే కొందరు దేవి పుష్ప 1 కి కూడా ఇంతకు మించే హైప్ ఇచ్చాడు కానీ ఆ రేంజ్ లో లేదు ఇప్పుడు మళ్ళీ 2 కి అంటున్నాడు సో మళ్ళీ దెబ్బ పడుతుంది అని అంటున్నారు. మొత్తానికి మాత్రం దేవి కామెంట్స్ ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారాయి.