ధనవంతులు కావాలని కోరికతో 9 ఏళ్ల బాలుడి నరబలి..శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి..!

ప్రస్తుత కాలంలో సాంకేతికంగా దేశం ఇంత అభివృద్ధి చెందిన కూడా ఇప్పటికీ మూఢనమ్మకాలను ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు. ఇలా మూఢనమ్మకాలను విశ్వసించేవారు దారుణాలకు పాల్పడుతున్నారు. ధనవంతులు కావాలనే కోరికతో ఇటీవల తొమ్మిదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఒక మైనర్ తో సహా మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వివరాలలోకి వెళితే..2022 డిసెంబర్ 29న సయాలీ గ్రామం నుంచి తొమ్మిదేళ్ల బాలుడిని అపహరించి మూఢనమ్మకాలతో నరబలి ఇచ్చారు. బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని బాలీవుడ్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో దాద్రా నగర్ హవేలీ జిల్లా కేంద్రమైన సిల్వాస్సా నుండి 30 కి.మీ దూరంలో ఉన్న వాపి నదిలో తలలేని శరీరం పోలీసులు గుర్తించారు. నరబలి నిర్వహించిన సయాలి గ్రామంలో మృతదేహం భాగాలు లభ్యమయ్యాయి. దీంతో శరీర భాగాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఇక ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ఒక మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.

పోలీసు విచారణలో ఆ బాలుడు సయాలీ గ్రామం నుంచి చిన్నారిని అపహరించి ఇద్దరు సహచరుల సాయంతో హత్య చేసినట్లు వెల్లడించాడు. మైనర్ బాలుడు తెలిపిన వివరాల మేరకు పోలీసులు హత్య గా కేసు నమోదు చేశారు. మైనర్ నేరస్థుడు తెలిపిన వివరాలతో పోలీసులు నరబలికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, చిన్నారిని చంపడానికి తన స్నేహితుడు శైలేష్ కొహ్కెరా, రమేష్ సన్వర్ కూడా భాగమేనని తెలుపటంతో శైలేష్, సన్వర్‌లను జనవరి 3న అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.