స్టార్ హీరోయిన్ ని చేసిన సౌత్ ఇండస్ట్రీ పై రష్మిక చిన్న చూపు… ఏకిపారేస్తున్న నెటిజన్స్…?

కన్నడ సినిమాల ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రష్మిక ఆ తర్వాత ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకుంది. ఈ సినిమా హిట్ అవటంతో వరుసగా గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా తెలుగు, తమిళ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న రష్మీక పుష్ప సినిమాలో నటించి బ్లాక్ అండ్ హిట్ కొట్టింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రష్మిక మంచి అవకాశాలు అందుకుంటోంది ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉంది.

ఇదిలా ఉండగా ఇటీవల తరచూ వివాదాల్లో నిలుస్తున్న రష్మిక తాజాగా మరొకసారి సౌత్ ఇండస్ట్రీ గురించి చులకనగా మాట్లాడి వివాదాల్లో నిలిచింది. సౌత్ ఇండస్ట్రీ గురించి రష్మిక చేసిన వ్యాఖ్యలకు నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ట్రోల్ చేస్తున్నారు. రష్మిక తాజాగా మిషన్ మజ్ను సినిమా ప్రమోషన్స్‌, సాంగ్స్ ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటూ వరుస ఇంటర్వూ లు ఇస్తోంది . ఈ క్రమంలో బాలీవుడ్ సాంగ్స్, సౌత్ సాంగ్స్ మధ్య పోలికలు చెబుతు సౌత్ ఇండస్ట్రీ గురించి చాలా చులకనగా మాట్లాడింది. ఈ ఇంటర్వూ లో రష్మిక మాట్లాడుతూ.. రొమాంటిక్ సాంగ్స్ తెరకెక్కించడంలో బాలీవుడ్ ది బెస్ట్ అని చెప్పటమే కాకుండా సౌత్‌లో ఎక్కువగా మాస్, మసాలా కమర్షియల్‌ హంగులే ఉంటాయని సౌత్ ఇండస్ట్రీ ని కించపరిచినట్టుగా మాట్లాడింది.

దీంతో మరోసారి రష్మిక ట్రోలింగ్‌కు గురవుతోంది.కన్నడ నుంచి సౌత్‌కు వచ్చాక.. కన్నడను తక్కువ చేసి మాట్లాడింది..ఇప్పుడు సౌత్ నుంచి నార్త్‌కి వెళ్లిన తరువాత సౌత్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నావ్.. అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రొమాంటిక్ సాంగ్స్ తెరకెక్కించడం సౌత్ వల్ల కాదా? సౌత్ సినిమాల్లో రొమాంటిక్ సాంగ్స్ లేవా? అంటూ మండిపడుతున్నారు. ఇప్పుడు దేశం మొత్తం సౌత్ ఇండస్ట్రీ వైపు చూస్తుంటే.. నీకు బాలీవుడ్ నచ్చిందా? అంటూ రకాలుగా రష్మికను ఆడేసుకుంటున్నారు. మరి దీనిపై రష్మీకి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.