దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారక ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.ఇలా సమంత ఈ వ్యాధితో బాధపడుతున్నానని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు అభిమానులు కాస్త కంగారు వ్యక్తం చేసిన ఈమె క్షేమంగా తిరిగి ఈ వ్యాధి నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు.అయితే సమంత ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుందని అందుకే ఈమె చికిత్స కోసం విదేశాలకు వెళ్లిందని వార్తలు కూడా వచ్చాయి.
ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి సమంత ఇకపై బాలీవుడ్ సినిమాలలో నటించదని అందుకే తాను కామెంట్ ఆయన బాలీవుడ్ సినిమాల నుంచి తప్పకున్నట్టు వార్తలు కూడా వినిపించాయి.అయితే తాజాగా సమంత సన్నిహితుల సమాచారం ప్రకారం సమంత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. ఈమె ఇప్పుడిప్పుడే మాయోసైటీస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటున్నారని, త్వరలోనే ఈమె కెమెరా ముందుకు రాబోతుంది అంటూ తన సన్నిహితులు తెలియజేశారు.
అదేవిధంగా సమంత గురించి వస్తున్నటువంటి పుకార్లను కూడా సమంత సన్నిహితులు కొట్టి పారేశారు.సమంత బాలీవుడ్ సినిమాల నుంచి తప్పుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తాను ఎలాంటి బాలీవుడ్ సినిమాలను తప్పుకోలేదని ఈమె కమిట్ అయిన సినిమాలన్నింటిలోనూ పాల్గొనబోతోంది అంటూ సమంత సన్నిహితులు వెల్లడించారు.అయితే ఈ వార్తలలో ఇంతవరకు నిజముందో తెలియదు కానీ సమంత మాత్రం మయో సైటీసెస్ వ్యాధి నుంచి కోలుకొని త్వరలోనే కెమెరా ముందుకు రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమంత అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.