1962లో జాతీయ రక్షణ ఫండ్ యాక్టివిటీ సమయంలో తన తండ్రి ఎన్టీఆర్ తో హరికృష్ణ కలిసి నడిచారు. బాల్యం నుంచే ఆయన ప్రజల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. తన తండ్రి అడుగుజాడల్లో నడిచి, మంచి వ్యక్తిగా ఖ్యాతిగడించారు.
ఈ ఫోటోను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్విట్టర్ లో షేర్ చేశారు. బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన హరికృష్ణకు నివాళులర్పించారు. “మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథసారథ్యం. చిన్నతనంలోనే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం. నందమూరి హరికృష్ణ గారు 1962లో జాతీయ రక్షణ ఫండ్ యాక్టివిటీ సమయంలో ఎన్టీఆర్ కంటే ముందు నడిచారు” అని క్రిష్ ట్వీట్ చేశారు.
క్రిష్ ఎన్టీఆర్ బయో పిక్ ను తెరకెక్కిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం క్రిష్… ఎన్టీఆర్, ఆయన కుటుంబ సభ్యుల జీవితాల గురించి పరిశోధనలు చేశారు. ఎన్నికల సమయంలో తన తండ్రి వెంటే ఉండి ప్రచార రథాన్ని నడిపారు హరికృష్ణ. ఇప్పుడు ఆ పాత్రను కూడా క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించబోతున్నారు. ఆ పాత్రను కళ్యాణ్ రామ్ పోషిస్తారని మాటలు వినిపించాయి. కానీ దీనిపై స్పష్టత లేదు. ఇప్పుడు హరికృష్ణ పాత్రలో ఎవరు నటిస్తారనేది సస్పన్షన్ గా మారింది.