రాజధానిలోని రోడ్లపై తొలి ఎలక్ట్రిక్ బస్సు పరుగులు తీస్తోంది
తుళ్లూరు ప్రాంతంలో ఈ-బస్సును మెగా సంస్థ వినియోగిస్తుంది
డ్రైవర్ కాకుండా 31 మంది కూర్చునేందుకు వీలున్న ఈ బస్సులో ఆర్టీసీ నడుపుతున్న గరుడలో ఉన్న సౌకర్యాలన్నీ ఉన్నాయి.
3 గంటలపాటు చార్జింగ్ చేస్తే సుమారు 300 కిలోమీటర్ల వరకు ఏకధాటిగా పరుగులు తీయగల సత్తా ఈ-బస్సు సొంతం.
ఈ బస్సును మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ సిబ్బంది కోసం అందుబాటులో ఉంచారు.
కాలుష్య రహిత బస్సులు కావడంతో వీటి కొనుగోలుపై పలు రాష్ట్రాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. తిరుపతి- తిరుమల నడుమ కూడా ఈ-బస్సును నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి.
రాజధాని ప్రాంతాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు ఈ-బస్సుల వాడకాన్ని పెంచే దిశగా సీఎం చర్యలు చేపడుతున్నారు.
ఇటీవలే ఆర్టీఏ అధికారులు పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ మంజూరు చేశారు.