పంది రూపంలో మనిషి పుట్టడానికి కారణం “ఒక వ్యక్తి” అని తెలుసా?

“బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే జరిగింది. పంది కడుపున మనిషి పుట్టాడు” ఈ న్యూస్ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. కొంతమంది ఫేక్ న్యూస్ అని కొట్టి పారేసినప్పటికీ కొందరు మాత్రం ఇది నిజం అనుకుని ఆ ఫోటోలను తెగ షేర్ చేసేస్తున్నారు. గురుపౌర్ణమి చంద్రగ్రహణం ఒకేరోజు వచ్చిన గత శుక్రవారం నాడు ఈ అద్భుతం జరిగిందని అబ్బుర పడిపోతున్నారు అమాయక జనం. ఈ న్యూస్ లో వాస్తవం లేదు. పంది కడుపున మనిషి పుట్టలేదు. “ఆ నరవరాహం సిలికాన్ పదార్ధంతో తయారైన ఒక బొమ్మ”.

ఇటలీకి చెందిన మగానుకో లైరా అనే కళాకారిణి దీనిని సృష్టించింది. ఆమె ఇలాంటి వింత బొమ్మలు ఎన్నో తయారు చేస్తుంటుంది.

వీటిని తన తన సొంత వెబ్సైటు ఎట్సీ.కామ్ లో అమ్మకానికి పెడుతుంటుంది.

ఈ మనిషి రూపంలో ఉన్న పంది బొమ్మ కూడా అలా వచ్చిందే. దీని ఎత్తు 29 సెం.మీ., బరువు 1 .19 కేజీలు., దీని ధర 500 యూరోలు (40,054.43 రూపాయలు). దీనికి తోడు షిప్పింగ్ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఆమె తను తాయారు చేసిన ఈ వింత బొమ్మలను తన సోషల్ మీడియా ఖాతాలలో కూడా పోస్ట్ చేసి ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అలా ప్రమోషన్ కి పెట్టిన ఈ పంది బొమ్మను ఎవరో ఆకతాయిలు పందికి పుట్టిన మనిషి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనిని నిజమే అని నమ్మి విపరీతంగా షేర్లు చేయటం మొదలెట్టేశారు నెటిజెన్లు.

కొందరు ఈ మానవ రూపంలో ఉన్న పంది సిద్దిపేటలో పుట్టిందంటుంటే, కొందరు యాదాద్రి జిల్లాలోని వీరారెడ్డి పల్లిలో పురుడు పోసుకుందంటూ విపరీతంగా ప్రచారం చేసేశారు. అసలు నిజమేంటో తెలిసింది కదా.. మరి ఇప్పటికైనా దీని ప్రచారం ఆగుతుందో లేదో.