పందులతో ఫోటోలకు ఫోజులివ్వాలనుకున్న మోడల్.. కొరికిన పందులు (వీడియో)

ఓ ఫిట్ నెస్ మోడల్ కు వింత అనుభవం ఎదురైంది. పందులతో మంచి ఫోటోలు దిగి ఫోజులివ్వాలనుకుంటే ఆమెకు ఆ పందులు రివర్స్ షాకిచ్చాయి. వెనిజులాకు చెందిన 32 ఏళ్ల మిచెల్ లెనిన్ అనే మహిళ ఫిట్ నెస్ మోడల్. బహమాస్ లోని ఫేమస్ పిగ్ ఐస్ లాండ్ ను ఆమె సందర్శించింది.

 అక్కడి పందులతో ఆడతూ తన ఇన్ స్టాగ్రామ్ కోసం అందమైన బికినిలో ఫోటోలు దిగాలనుకుంది. కానీ ఆ  పందులు ఆమె పై దాడి చేసి కొరికేసాయి. దీంతో బొబ్బలు పెడుతూ ఆమె పరిగెత్తింది. ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.