ప్రస్తుత కాలంలో డబ్బుకి ఉన్న విలువ రక్తసంబంధానికి లేకుండా పోయింది. డబ్బు కోసం తోడబుట్టిన వారిని కనిపించిన తల్లితండ్రులను కూడా హత్యలు చేయటానికి వెనుకాడటం లేదు. ముఖ్యంగా అన్నదమ్ములు మధ్య ఆస్తి తగాదాల వల్ల తరచూ వివాదాలు చోటు చేసుకోవటమే కాకుండా ఆ వివాదాల ముదిరి హత్యలు చేయటానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల ఇటువంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రైతు భరోసా తండ్రికి వచ్చి పింఛన్ పంచుకోవడంలో అన్నదమ్ముల మధ్య వచ్చిన వివాదం వల్ల తమ్ముడిని అన్న కిరాతకంగా చంపి పొలంలో పాతిపెట్టిన ఘటన హుకుం పేట మండలంలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే…హుకుంపేట మండలం రంగశీల పంచాయతీకి చెందిన కృష్ణ, జైరామ్ ఇద్దరు సోదరులు. అయితే వీరిద్దరూ తన తండ్రికి వచ్చి పింఛను డబ్బులు అతని భూమిపై వచ్చిన రైతు భరోసా డబ్బులు పంచుకోవడంలో తరచూ గొడవ పడుతూ ఉండేవారు. గతంలో ఒకసారి రైతు భరోసా డబ్బులలో వాటా అడిగినందుకు పెద్ద కుమారుడు కృష్ణ తన తమ్ముడు జయరామ్ మీద తుపాకీతో దాడి చేయడంతో జయరాం భార్య అడ్డు వచ్చింది ఆ సమయంలో ఆమె చేతికి గాయం అయింది. ఈ ఘటనతో కృష్ణ జైలుకు వెళ్లి వచ్చాడు.
ఈ ఘటనతో జైరామ్ కి 20000 రూపాయలు చెల్లించాలని గ్రామ పెద్దలు తీర్పునివ్వగా కృష్ణ కేవలం 10000 రూపాయలు మాత్రమే చెల్లించాడు. అంతేకాకుండా ఈ ఏడాది వచ్చిన రైతు భరోసా డబ్బులలో జయరాం వాటా అడగటంతో పాటు గతంలో ఇవ్వాల్సిన పదివేల రూపాయల డబ్బులు కూడా ఇవ్వాలని కృష్ణని డిమాండ్ చేశాడు. దీంతో కృష్ణ తన తమ్ముడిని హత్య చేసి పొలంలో పాతిపెట్టాడు. నెల రోజులుగా భర్త ఇంట్లో లేకపోవడంతో కూలి పనుల కోసం వలస వెళ్లాడని భార్య భావించింది. కాకపోతే భర్త వద్ద నుండి ఒక్క ఫోన్ కూడా రాకపోవడంతో పాటు బావ ప్రవర్తనలో తేడా గమనించిన జైరామ్ భార్య తన భర్త కనిపించడం లేదని తన భావే తన భర్తని హత్య చేసి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జైరామ్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా కృష్ణ అసలు విషయం బయట పెట్టాడు. కానీ తన తమ్ముడిని చంపి పొలంలో పాతిపెట్టానని నేరం అంగీకరించాడు. దీంతో పాడేరు సీఐ సుధాకర్, పోలీసులు, క్లూస్ టీమ్, రెవెన్యూ అధికారులు కలిసి మృతదేహాన్ని బయటకు తీయించటానికి వెళ్లగా ఎవరికి అనుమానం రాకుండా ఆ ప్రదేశంలో కృష్ణ మిరప మొక్కలు నాటించాడు. పోలీసులు జైరామ్ మృతదేహాన్ని వెలికి తీసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.