సాధరణంగా అత్త కోడల మధ్య తరచుకోవడం జరుగుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఈ గొడవలు ఎక్కువ కావటం వల్ల కుటుంబాలు విడిపోయి వేరుగా జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే మరి కొంత మంది మాత్రం అత్త పెట్టి బాధలు భరించలేక వారి మీద కక్ష తీర్చుకునే వారు కొందరైతే.. అత్తింటి వేధింపులు భరించలేక మరి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఇటువంటి సంఘటన తామరలో చోటు చేసుకుంది. తన భర్త మరణానికి కారణం నువ్వే అంటూ అత్త సూటిపోటి మాటలతో పెడుతున్న హింస భరించలేక మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాలలోకి వెళితే…తామరకు చెందిన ఆశిష్‌కుమార్ కి తన మేనత్త కుమార్తె మాధవితో 2019లో వివాహం జరిగింది. వీరి వివాహం ఆశిష్ కుమార్ తల్లికి ఇష్టం లేకపోయినా అందరి బలవంతం మీద ఈ పెళ్లికి అంగీకరించింది. అయితే పెళ్ళి జరిగిన సమయం నుండి సూటిపోటి మాటలతో మాధవిని బాధ పెడుతూ ఉండేది. ఆశిష్ ఆర్మీ ఉద్యోగి కావటంతో కొంతకాలం తర్వాత భార్యను తనతో పాటు కాశ్మీర్ కి తీసుకెళ్ళాడు. ఈ దంపతులకు ఇప్పుడు ఏడాది వయసున్న పాప ఉంది. అయితే ఇటీవల ఆశిష్ తండ్రి మరణించటంతో తన భార్య మధవితో కలిసి స్వగ్రామానికి చేరుకున్నాడు.
ఈ క్రమంలో సోమవారం ఆశిష్ తండ్రి దిన కర్మను పూర్తి చేశారు. అయితే తన భర్త మరనించటానికి నువ్వే కారణం అంటూ ఆశిష్ తల్లి మాధవిని సూటిపోటి మాటలతో హింసించింది. ప్రతీ విషయంలోనూ అత్త ఇలా తన మాటలతో హింసిస్తుంటే మాధవి వాటిని మౌనంగా భరించేది. కానీ తన మామ చనిపోవటానికి కారణం తానే అంటూ అత్త వేసిన నిందతో మాధవి తీవ్ర మనస్థాపం చెంది సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా అర్థరాత్రి సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం తేల్లారిన తర్వాత కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గుర్తించి మాధవిని కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మాధవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.