చిన్న జీయర్ స్వామికి తృటిలో తప్పిన ప్రమాదం (వీడియో)

ప్రముఖ ధార్మిక వేత్త, ఆధ్యాత్మిక గురువు, ఉపదేశకుడు, వైష్ణవ పండితుడైన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామికి పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన మంగళవారం వైకుంఠ ఏకాదశి రోజు జరిగింది. అయితే ఆ వీడియో మాత్రం ఆసల్యంగా వెలుగు చూసింది. పూర్తి వివరాలు, వీడియో కింద ఉన్నాయి.

వైంకుఠ ఏకాదశి నాడు హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజలకు చిన్న జీయర్ స్వామి హాజరయ్యారు. గోపురం మీద పూజలు జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. కట్టెలతో ఆలయ గోపురం వద్ద ప్రత్యేక పూజల కోసం తాత్కాళిక నిర్మాణం చేప్టటారు ఆలయ నిర్వాహకులు. అయితే ఆ కట్టెలతో నిర్మించిన మంతెన ఒక్కసారిగా కుంగిపోయింది. రెండుసార్లు అలా కుంగిపోవడంతో అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు.

కెపాసిటీకి మించిన వ్యక్తులు అక్కడకు చేరడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి చిన్న జీయర్ స్వామిని సురక్షితంగా కిందకు దించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిన్నజీయర్ స్వామి హాజరవుతున్నారంటే ఆలయ నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది.

అసలు కెపాసిటీకి మించిన వ్యక్తులను ఆలయ గోపురం వద్దకు ఎందుకు రానిచ్చారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. జరిగిన ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.