వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించబోయే శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు బుధవారం తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు 3 వేల నుంచి 4 వేల మంది వీఐపీలకు ఉదయం 4 గంటల నుంచి, సామాన్య భక్తులకు ఉదయం 8 గంటల నుంచి వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభిస్తామని ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. రాబోయే 10 రోజుల పాటు టిక్కెట్లు లేని భక్తులు తిరుమల కొండకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వైకుంఠ ద్వారా దర్శన టిక్కెట్లను స్థానికులకు జారీ చేస్తోంది టీటీడీ. టోకెన్ల కోసం అర్ధరాత్రి నుంచే భక్తులు స్థానికులు టీటీడీ కౌంటర్లు ఏర్పాటు చేసిన ప్రదేశల్లో బారులు తీరారు. అందులో సామాన్య భక్తుల వలే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి క్యూ లైన్ స్థానికులతో పటు వేచి ఉంది టిక్కెట్లను పొందారు. వైకుంఠ ఏకాదశి నాడు సామాన్య భక్తులతో కలసి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటామని అయన చెప్పారు.క్యూ లైన్లో ఉన్న స్థానికులకే కాకుండా స్థానిక ఏతరులకు కూడా టీటీడీ టిక్కెట్లను జారీ చేసింది.