ఎటిఎంలో ఇలాంటి దొంగలుంటారు జాగ్రత్త (వీడియో)

మనం నిత్యం బ్యాంకు దోపిడీలు చూస్తూనే ఉన్నాం. కొందరు ఆయుధాలు తీసుకొచ్చి బ్యాంకులో ఉన్న సిబ్బందిని కస్టర్లను హ్యాండ్స్ అప్ అని బెదిరించడం.. కదిలితే కాల్చేస్తా అని తుపాకులు చూపించడం కూడా కొందరు చూసి ఉన్నారు. సినిమాల్లో ఈ తరహా రాబరీ బాగా చూపిస్తారు. ఇక విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వైట్ కాలర్ నేరగాళ్లు ఎలా బ్యాంకులను దోపిడీ చేస్తారో కూడా మనకు బాగా తెలిసిన ముచ్చటే.

ఇక ఎటిఎంలలో దోపిడీలు కొత్త తరహాలో సాగుతున్నాయి. ఎటిఎం దోపిడీ గురించి కూడా మనకు ఒక అవగాహన ఉంటది. ఎటిఎం మిషిన్ ను పగలగొట్టి డబ్బు కొల్లగొట్టే ప్రయత్నం చేసినవారు కొందరుంటారు. కానీ ఈ కిరాక్ దొంగలు ఎటిఎంలో ఎలా దొంగతనం చేశారో కింద వీడియోలో ఉంది చూడండి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

అసలు విషయం ఏందంటే ఇద్దరు నేరగాళ్లు ఎటిఎం పరిసరాల్లో మాటు వేసి ఉన్నారు. అమాయకులైన వారు ఎటిఎం కు రాగానే వారు కూడా ఎటిఎంలో జొరబడ్డారు. వారిలో ఒకడు తన కార్డును గీకుతూ డబ్బు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఇంకొకడు మాత్రం అమాయకులు అయిన వారికి సాయం చేస్తున్నట్లు నటిస్తాడు. అమాయకులు ఎటిఎంలో డబ్బు తీసుకోవడం రావడంలేదని ఈ వ్యక్తి వారి కార్డును తీసుకుని పక్కవాడికి ఇస్తాడు. పక్కవాడు వెంటనే ఆ కార్డును తన ముందున్న మిషన్ లో గీకుతాడు. తర్వాత ఈ అమాయక మనుషులు తమ పిన్ నెంబరు నె చెబుతారు. వెంటనే ఇక్కడ పిన్ నెంబరు తప్పుగా టైప్ చేసి ఇక్కడ డబ్బు రాట్లేదని చెప్పి పంపించేస్తాడు. తర్వాత ఇంకో నేరగాడు ఉన్న ఎటిఎం మిషన్ లో ఆ పిన్ నెంబరు టైప్ చేస్తాడు. తర్వాత నగదు విత్ డ్రా చేస్తారు. ఇద్దరూ కలిసి మెల్లగా అక్కడినుంచి జారుకుంటారు. ఇలా బాగానే దొంగతనం చేశారు కానీ.. ఆ దరిద్రులకు తెల్వదు ఎటిఎంలో సిసి కెమెరా మంచిగ రికార్డు చేస్తదని. సిసి కెమెరాలో వారి బొమ్మలు రికార్డు అయ్యాయి.

ఏది ఏమైనా బ్యాంకులో, ఎటిఎంలో లావాదేవీలు జరిపేటప్పుడు జరంత పైలం అని పోలీసులు చెబుతున్నారు