కట్నం వేధింపులకు బలైన మరో యువతి.. హత్య చేసే ఆత్మహత్యగా చిత్రీకరణ!

ఆడపిల్లల సుఖసంతోషాల కోసం తల్లిదండ్రులు అధిక మొత్తంలో కట్నం ఇచ్చి మరి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. అయితే కొంతమంది అత్తింటివారు మాత్రం అదనపు కట్నం కోసం కోడళ్లను వేధించడమే కాకుండా వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇటీవల ఇటువంటి దారుణ ఘటన మద్యప్రదేష్ లో వెలుగులోకి వచ్చింది. కూతురు సంతోషంగా ఉండాలని రూ.21 లక్షలు కట్నంగా ఇచ్చి ఎంతో ఘనంగా పెళ్లి చేసిన అతనికి సంవత్సరం కూడా తిరగకుండానే కూతురు మిగతాజీవిగా మారిపోయింది. కట్నం కోసం అత్తింటి వారు ఆమెని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

వివరాలలోకి వెళితే…మధ్యప్రదేశ్ సాగర్‌లోని గోపాల్‌గంజ్ పరిధి శ్రీరామ్ కాలనీలో నివాసం ఉంటున్న పునీత్ శర్మ అనే వ్యక్తికి ప్రతిష్ట అనే యువతీతో జనవరి 20న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో యువతీ తల్లిదండ్రులు రూ.21 లక్షలు పునీత్ కి కట్నంగా ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగిన కొంతకాలం పాటు సంతోషంగా ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత పునీత్ మద్యానికి బానిసై తరచు ప్రతిష్టని వేధిస్తూ ఉండేవాడు. అతనితోపాటు అతని కుటుంబ సభ్యులు కూడా అదనపు కట్నం కోసం ఆమెను వేధించడమే కాకుండా పిల్లల్ని తొందరగా కనమంటూ చిత్రహింసలకు గురి  చేసేవారు.

ఈ విషయాల గురించి ప్రతిష్ట తన తల్లిదండ్రులతో చెప్పి బాధపడుతూ ఉండేది. అయితే కొన్ని రోజులు సర్దుకుపోతే అన్ని సక్రమంగా జరుగుతాయని తల్లిదండ్రులు సర్ది చెప్పడంతో ప్రతిష్ట బాధలు భరిస్తూ అత్తగారింట్లో ఉంటుంది. అయితే ఇటీవల ప్రతిష్టా చనిపోయినట్లు తన అత్తింటి వారి నుండి ఫోన్ రావటంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు విగత జిపిగా ఉన్న తమ కూతురుని చూసి బోరున విలపించారు. ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు పునీత్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ప్రతిష్ట కాళ్ళు చేతులు మీద కత్తితో కోసిన ఘాట్లు కనిపించడంతో అనుమానం వచ్చిన ప్రతిష్ట తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రతిష్ట మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పునీత్ మీద చర్యలు
తీసుకోనున్నట్లు వెల్లడించారు.