న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన మహిళ… పోలిసుల ఎదుటే ఆత్మాహుతికి యత్నం..!

ఈ రోజుల్లో ఆడపిల్లలు మగవారి చేతుల్లో చాలా సులభంగా మోసపోతున్నారు. పెళ్ళి చేసుకుంటామని గుడ్డిగా వారిని నమ్మించి శారీరకంగా లోబరుచుకొని ఆడవారిని మోసం చేస్తున్నారు. ప్రతిరోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ అమ్మాయిలు మాత్రం మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ లోని ఒక రెవెన్యూ అధికారి ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను మోసం చేసి పెళ్లి మాట ఎత్తితే తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వచ్చి అక్కడ తనకి న్యాయం జరగకపోవటంతో పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంది. ఈ ఘటన రాష్ట్రం మొత్తం తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే….మధ్యప్రదేశ్ లోని షాడోల్ జిల్లాలో 26 ఏళ్ల యువతిని ఒక రెవెన్యూ అధికారి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెని శారీరకంగా లోబరుచుకున్నాడు. అయితే కొన్ని నెలలు గడిచిపోవటంతో తనను పెళ్లి చేసుకోమని సదరు యువతి రెవెన్యూ అధికారిని కోరింది. అయితే అతడి నుండి సరైన స్పందన రాకపోగా ఫోన్ చేసినా కూడా ఆమె ఫోన్ ని ఎత్తకుండా దూరం పెట్టసాగాడు. ఈ క్రమంలో యువతి తాను మోసపోయానని గ్రహించి రెవెన్యూ అధికారిపై కేసు పెట్టాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో షాడోల్ జిల్లాలోని బుధార్ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు వివరించి రెవెన్యూ అధికారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను వేడుకుంది.
పోలీసులు ఆమె ఫిర్యాదును అంగీకరించకపోవడంతో పాటు ఈ విషయాన్ని బయటే తేల్చుకోమని ఆమెకు సలహా ఇచ్చారు దీంతో ఆ మహిళ ఏమీ చేయలేక వెనుతిరిగింది. ఈరోజు కూడా అదే పోలీస్ స్టేషన్ కి వెళ్లి రెవెన్యూ అధికారిపై ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేయటంతో పోలీస్ అధికారులు సదరు నిందితుడిని పోలీస్ స్టేషన్ కి పిలిపించారు.

ఈ క్రమంలో రెవెన్యూ అధికారికి యువతికి మధ్య గొడవ జరిగి తనకు న్యాయం జరగటం లేదని మనస్థాపం చెందిన యువతి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని పోలీసుల ఎదుట ఆత్మహత్యకి ప్రయత్నించింది. ఇది గమనించిన పోలీసులు వెంటనే మంటలు అర్పి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నీ పండించుకోవడం వల్ల తీవ్ర గాయాల పాలైన సదరు యువతి ప్రాణాలతో పోరాడుతోంది. ప్రస్తుతం ఈ ఘటన మధ్యప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపుతోంది.