సాధారణంగా మంచినీళ్ల బాటిల్ కొని తాగిన తర్వాత ఆ బాటిల్స్ ను వేరే విధంగా ఉపయోగిస్తూ ఉంటారు. వాడేసిన ఈ వాటర్ బాటిల్స్ లో డీజిల్, పెట్రోల్ వంటి వాటిని పోస్తూ ఉంటారు. అయితే పొరపాటున కొంతమంది వీటిని మంచినీళ్లు అనుకొని తాగుతూ ఉంటారు. తాజాగా దాహంగా ఉండటంతో ఇంట్లో ఉన్న మంచినీళ్ల బాటిల్లో ఉండే నీళ్ళు తాగిన మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనంగా మారింది. కాళీ వాటర్ బాటిల్ లో యాసిడ్ నింపి ఇంట్లో ఉంచడంతో మహిళ వాటిని తాగటంతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది.
వివరాలలోకి వెళితే…. విజయవాడలోని లంబాడీపేట అంబటి సముద్రాల వీధిలో గురవమ్మ (50) అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. తాజాగా మంగళవారం ఉదయం దాహంగా ఉండటంతో ఇంటి వరండాలో టేబుల్‌పై ఉన్న వాటర్ బాటిల్ లో నీరు అనుకొని తాగింది . అయితే, దానిలో నీటికి బదులు యాసిడ్ ఉండటాన్ని ఆమె గుర్తించలేక పోయింది. ఆ బాటిల్ లో ఉన్నవి మంచినీళ్లు అనుకుని పొరపాటున తాగింది.
అల తాగిన వెంటనే మహిళ నోరు మంటతో పాటు పెదవులపై బొబ్బలు వచ్చాయి. అంతే కాకుండా వెంటనే వాంతులు చేసుకుని అక్కడికక్కడే కుప్పకూలింది. గురువమ్మ పరిస్థితి గమనించిన కొడుకు, కోడలు వెంటనే గురవమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి గురవమ్మ మృతి చెందింది. యాసిడ్ తాగటంతో ఆస్పత్రికి చేరేలోపే కడుపులో ఉన్న పేగులు ఇతర అవయవాలు పూర్తిగా కలిపోవటం తో గురువమ్మ మరణించిందని డాక్టర్లు వెల్లడించారు. మృతురాలి కొడుకు శివకృష్ణ ఈ ఘటన గురించి పోలిసులకు ఫిర్యాదు చేయటం తో కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.