వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడుతో కలిసి భర్తని అంతం చేసిన భార్య…!

ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తల జీవితంలో ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు చిచ్చు రేపుతున్నాయి. ఈ వివాహేతర సంబంధాల వల్ల భార్య భర్తలు ఒకరికొకరు దూరం కావడమే కాకుండా ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడటం లేదు. వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారని కొందరు మహిళలు దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇటువంటి దారుణ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యని బట్ట మందలించటంతో అతనిని చంపటానికి మూడుసార్లు ప్రయత్నం చేసింది రెండు సార్లు చావు నుండి బయటపడిన సదరు బాధితుడు మూడోసారి ఆమె పథకం నుండి తప్పించుకోలేకపోయాడు.

వివరాలలో వెళితే…మంచిర్యాల జిల్లా చెన్నూరు కిష్టంపేటకు చెందిన రవళి కి తన మేనమామ కుమారుడైన రాజేందర్‌ తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన సమయం రవళి తన భార్యతో అంటీ ముట్టనట్లు ఉండేది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్య తనకి దూరంగా ఉండటంతో ఆమె మీద అనుమానం వచ్చిన రాజేందర్ ఆమె వివాహేతర సంబంధం గురించి తెలుసుకొని ఆమెను మందలించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. పువ్వులలో పెట్టీ చూసుకునే భర్తను మోసం చేస్తూ ప్రియుడితో సంబంధం కొనసాగిస్తోంది. అయితే తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి మూడుసార్లు అతనిని చంపే ప్రయత్నం చేసింది.

మొదట కారుతో గుద్దించి భర్తను చంపటానికి ప్రయత్నం చేసింది. కానీ అదృష్టవశాత్తు రాజేందర్ తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. రెండవసారి గేట్ కి కరెంట్ సప్లై ఇచ్చి హత్య చేయటానికి ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా రాజేందర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక మూడవసారి ఏకంగా ప్రియుడిని ఇంటికి పిలిపించి రాత్రి రాజేందర్ నిద్రపోతున్న సమయంలో గన్ను తో కాల్చి చంపారు. అయితే ఎవరో ఇద్దరు దుండుగులు హెల్మెట్ ధరించి తన భర్తను చంపారని కథ అల్లి అందరిని నమ్మించటానికి ప్రయత్నం చేసింది. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు పట్టణ స్థలానికి చేరుకొని పరిశీలించి రాజేందర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులు విచారణ ప్రారంభించగా గతంలో రాజేందర్ పై జరిగిన హత్యా ప్రయత్నాల గురించి బయటపడటంతో తమదైన శైలిలో రవళిని విచారించగా అసలు విషయం బయట పెట్టింది. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.