అమెజాన్ సీఈవో సంచలన ప్రకటన

అమెజాన్ సంస్థ సీఈవో జెఫ్ బెజోస్ సంచలన ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఆయన ఇటువంటి ప్రకటన చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. ఆయన తన భార్య  మెకంజీతో విడాకులు తీసుకుంటున్నానని ప్రకటించి అందరిని షాక్ కు గురి  చేశారు.

జెఫ్ బెజోస్, మెకంజీలు 25 సంవత్సరాల క్రితం ప్రేమించుకొని పెళ్లి  చేసుకున్నారు.  అన్యోన్యంగా జీవించిన ఈ జంట అందరిని విస్మయం పరిచేలా నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలం ప్రేమతో జీవితాన్ని పంచుకున్న తాము పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని, ఇక నుంచి తాము స్నేహితులుగా కొనసాగుతా మని వారు సంయుక్తంగా ట్వీట్ చేశారు. తమ జీవితంలో జరిగిన అతి పెద్ద మార్పును ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో తెలియజేశామని వారు ప్రకటించారు. 

Image result for AMAZON CEO COUPLES

మెకంజీ రచయిత్రి. ఆమె రెండు పుస్తకాలను కూడా రాశారు. అమెజాన్ ప్రారంభించిన కొత్తలో మెకంజీ ఉద్యోగిగా పని చేశారు. 2014లో వేధింపులకు వ్యతిరేకంగా బై స్టాండర్డ్ అనే ఉద్యమాన్ని కూడా ఆమె నిర్వహించారు. జెఫ్, మెకంజీ దంపతులకు నలుగురు పిల్లలున్నారు. కొన్ని రోజులుగా మెకంజీ కంపెనీకి సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదు. దంపతులిద్దరు కలిసి నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లోనే కనిపిస్తున్నారు. 25 ఏళ్లు కలిసి ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని జెఫ్ బెజోస్ అన్నారు. ఇప్పుడు మంచి స్నేహితులుగా, కుటుంబ సభ్యులుగా ఉంటానన్నారు.

జెఫ్ బోజోస్ ఓ టివి ఛానల్ యాంకర్ తో ప్రేమలో పడ్డాడని ఆమెతో అతను సన్నిహితంగా ఉండడం మెకంజీ చూసిందని తెలుస్తోంది. అందుకే వీరు విడాకులు తీసుకుంటున్నారని సమాచారం. ఈ ప్రకటనతో అమెజాన్ వాటాదారులు షాక్ గురయ్యారు. విడాకుల అంశం అమెజాన్ విషయంలో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ వారంలోనే మైక్రోసాఫ్ట్ ను దాటి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అమెజాన్ రికార్డులోకెక్కింది. ఇప్పుడు భార్యకు ఆస్తులు పంచి ఇస్తే జెఫ్ బెజోస్ సంపద తగ్గనుంది.