దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్ ను అమలు చేస్తుండటం గమనార్హం. మనలో చాలామంది ఇన్వెస్ట్ చేసిన మొత్తం రెట్టింపు కావాలని భావిస్తుంటారు. ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేసిన డబ్బు రెట్టింపు కావాలంటే కొన్ని స్కీమ్స్ అమలులో ఉన్నాయి. ఈ స్కీమ్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పవచ్చు.
వేర్వేరు టెన్యూర్లతో ఎస్బీఐ ఈ స్కీమ్స్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఎంచుకునే టెన్యూర్ ను బట్టి వడ్డీ రేటు మారడంతో పాటు పొందే మొత్తం కూడా మారే అవకాశం అయితే ఉంటుంది. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు ఎస్బీఐ స్కీమ్స్ ను ఎంచుకోవడం వల్ల మెచ్యూరిటీ సమయానికి పొందే అవకాశం ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా పొందే వడ్డీలో మార్పులు ఉంటాయి.
5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మూడేళ్ల పాటు ఎదురుచూస్తే 6.2 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. 5 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసే మొత్తానికి ఇన్సూరెన్స్ ఉండటంతో ఆ మొత్తం డిపాజిట్ చేసే విషయంలో ఎలాంటి టెన్షన్ సైతం అక్కర్లేదని చెప్పవచ్చు. అవసరం అనుకుంటే వేర్వేరు బ్యాంకులలో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు.
పెద్ద మొత్తంలో బ్యాంకులలో డబ్బులు దాచుకుంటే మాత్రం పొరపాటు చేసినట్టు అవుతుందని చెప్పవచ్చు. ఎస్బీఐలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో భారీ స్థాయిలో బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇతర బ్యాంకులతో పోల్చి చూస్తే ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదని చాలామంది భావిస్తున్నారు. 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 9 నుంచి 10 సంవత్సరాలు ఎదురుచూస్తే భారీ మొత్తంలో ఆదాయం సొంతమవుతుంది.