రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్స్ అమలులో ఉన్నాయి. పోస్టాఫీస్ స్కీమ్స్ లో టైమ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ సమయంలో పెట్టుబడిని రెట్టింపు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బ్యాంకులతో పోల్చి చూస్తే పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఎక్కువ వడ్డీ లభిస్తోంది.
రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వాళ్లు పోస్టాఫీస్ స్కీమ్స్ పై ప్రత్యేక దృష్టి పెడితే మంచిది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే 114 నెలల్లో ఆ డబ్బు రెట్టింపు అవుతుంది. 5 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ తో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 7.25 లక్షల రూపాయలు పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా 2.25 లక్షల రూపాయల వడ్డీ లభిస్తుందని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 5 లక్షల రూపాయల లాభం పొందవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ట్యాక్స్ బెనిఫిట్ తో పాటు సెక్షన్ 80సీ కింద ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. కనీసం 1000 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. నచ్చిన టెన్యూర్ ను ఎంచుకుని ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.
ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుంటే మాత్రమే ఈ స్కీమ్ ఇన్వెస్ట్ చేయడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. టైమ్ డిపాజిట్ స్కీమ్ వల్ల ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుంది. ఆసక్తి ఉన్నవాళ్లు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో వెంటనే ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.