దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్త పాలసీలతో కస్టమర్లకు దగ్గరవుతోంది. ఏ పాలసీ తీసుకున్నా భారీ స్థాయిలో బెనిఫిట్స్ కలిగేలా ఎల్ఐసీ కొత్త పాలసీలు ఉన్నాయి. ఎల్ఐసీ పాలసీలలో జీవన్ శాంతి పాలసీ ఒకటి కాగా ఈ పాలసీ తీసుకోవడం ద్వారా నెలనెలా 10,000 రూపాయల పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.
ఈ పాలసీని తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎల్ఐసీ స్కీమ్స్ లో ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ గా ఉంది. ఈ పాలసీ తీసుకునే వాళ్లకు ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు వేర్వేరు ఆప్షన్లు ఉండగా ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి పొందే మొత్తం మారుతుంది. రిటైర్మెంట్ ప్లాన్ చేసేవాళ్లకు ఈ పాలసీ అన్ని రకాలుగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
30 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీని తీసుకున్న వాళ్లకు 6.8 శాతం నుంచి 14.62 శాతం వరకు వడ్డీరేటును పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ఎలాంటి లిమిట్ లేకపోవడంతో ఎంత మొత్తమైనా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 30 సంవత్సరాల వయస్సులో 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 40 ఏళ్ల నుంచి ప్రతి నెలా 10,000 రూపాయలు పొందవచ్చు.
నచ్చిన మొత్తం ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనం చేకూర్చుతుంది. పాలసీ తీసుకున్న వ్యక్తి మధ్యలోనే చనిపోతే నామినీ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ను ఒక్కరు తీసుకోవడం లేదా భాగస్వామితో కలిసి తీసుకోవడం జరుగుతుంది. సమీపంలోని ఎల్.ఐ.సీ ఏజెంట్ ను లేదా ఎల్.ఐ.సీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకోవచ్చు.